Site icon HashtagU Telugu

AP : రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు..లేకపోతే 40 స్థానాల్లో విజయం మనదే – పవన్

Pawan Jagan Siddam

Pawan Jagan Siddam

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి పొత్తు ఫై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ(TDP)తో పొత్తు పెట్టుకున్నామని , లేకపోతే ఒంటరిగా వెళ్తే 40 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తాం అని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన పవన్ కళ్యాణ్..ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని , జగన్ ను గద్దె దించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ తరుణంలో ఒంటరిగా పోటీ చేసి ఓట్లు చీల్చే బదులు..పొత్తు పెట్టుకొని బరిలోకి దిగితే జగన్ ను ఓడించవచ్చని ఫిక్స్ అయ్యాడు. దీంతో 2014 లో ఎలాగైతే టీడీపీ కి సపోర్ట్ చేసి..విజయంలో కీలక పాత్ర పోషించారో..ఇప్పుడు అలాగే టీడీపీ తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతుంది జనసేన. ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపిక , మేనిఫేస్టు కు సంబదించిన చర్చలు జరిపారు.

ఇక పార్టీ నేతలతో కూడా పొత్తు ఫై దిశా నిర్దేశం చేస్తూ..విజయం కోసం కష్టపడాలని సూచిస్తూ వస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నాయకులతో భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తాం. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు ఉంటుంది. ఈ ఎన్నికల్లో మన ప్రతి అడుగూ వ్యూహాత్మకమే. కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ పనిచేయాలి’ అని పిలుపునిచ్చారు. కూటమి నిర్ణయం అనే ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలను, సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చేసిందేనని చెప్పారు. వ్యక్తిగతంగా తన ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోనని.. సమష్టిగా నిలిచే విధంగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తాను అన్నారు. పార్టీ బలోపేతం.. పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ.10 కోట్లు తన స్వార్జితాన్ని నిధిగా ఇవ్వనున్నట్లు ఈ సమావేశంలో ప్రకటించారు.

టీడీపీ, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. క్షేత్రస్థాయి నుంచి బలాన్ని సద్వినియోగపరచుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకుళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అన్నారు. వ్యక్తిగతంగా తన గెలుపు గురించి కాదు.. సమష్టి గెలుపు కోసమే తొలి నుంచీనా వ్యూహం, అడుగులు ఉంటున్నాయని తెలిపారు. జనసేన కోసం తపించి పని చేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

Read Also : Farmers Protest ‘ఛలో ఢిల్లీ’ పాదయాత్రను పునఃప్రారంభించిన రైతులు

Exit mobile version