BJP Alliance : బిజెపితో పొత్తు..పార్టీని వీడేందుకు పలువురు టీడీపీ నేతలు ..

టీడీపీ – జనసేన తో బిజెపి పొత్తు పెట్టుకోవడం ఆయా పార్టీల్లోని కొంతమందికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు వల్ల ఇరు పార్టీల్లోని కొంతమందికి టికెట్ రాని పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఇది చాలదన్నట్లు బిజెపి తో పొత్తు పెట్టుకొనేసరికి చాలామంది ఆగ్రహం గా ఉన్నారు. అసలు రాష్ట్రంలో బిజెపి ఏమాత్రం పట్టులేదు. అలాంటప్పుడు ఎందుకు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పొత్తు కోసం వెంటపడ్డారని వాపోతున్నారు. We’re […]

Published By: HashtagU Telugu Desk
Pawan Babu Amith

Pawan Babu Amith

టీడీపీ – జనసేన తో బిజెపి పొత్తు పెట్టుకోవడం ఆయా పార్టీల్లోని కొంతమందికి ఏమాత్రం నచ్చడం లేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తు వల్ల ఇరు పార్టీల్లోని కొంతమందికి టికెట్ రాని పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఇది చాలదన్నట్లు బిజెపి తో పొత్తు పెట్టుకొనేసరికి చాలామంది ఆగ్రహం గా ఉన్నారు. అసలు రాష్ట్రంలో బిజెపి ఏమాత్రం పట్టులేదు. అలాంటప్పుడు ఎందుకు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పొత్తు కోసం వెంటపడ్డారని వాపోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ పొత్తుల వ్యవహారం టీడీపీ పార్టీకి చెందిన కొందరు నాయకులకు ఏమాత్రం మింగుడు పడట్లేదు. చంద్రబాబు తీసుకుంటోన్న నిర్ణయాలతో విభేదిస్తోన్నారు. పార్టీలో కొనసాగడానికీ ఇష్ట పడట్లేదు.ఈ క్రమంలో కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, ఏపీఎస్ఆర్టీసీ మాజీ ఛైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి.. టిడిపికి గుడ్‌బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు పంపించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగానని, ఎన్నో అడ్డంకులను అధిగమించానని, కడప జిల్లాలో పార్టీని నిలబెట్టడానికి కృషి చేశానని అన్నారు. ఈ మధ్యకాలంలో పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయని రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అంతే కాదు వెంటనే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన మాత్రమే కాదు మరికొంతమంది కూడా ఇదే బాటలో ఉన్నారని అంటున్నారు. ఇక ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత జనసేన , టీడీపీ రెండు పార్టీలో నుండి పెద్ద ఎత్తున నేతలు బయటకు రాబోతారని అంటున్నారు.

వీరి లెక్క ఇలా ఉంటె..అధినేతల లెక్క మరోలా ఉంది. కేంద్రంలో మరోసారి బిజెపి నే రాబోతుంది. ఈ క్రమంలో బిజెపి తో పొత్తు పెట్టుకుంటే..ఏపీకి మరింత కలిసి వస్తుంది..కూటమి గెలిస్తే అప్పుల నుండి ఎంతో కొంత ఏపీ బయటపడుతుందని..ఎదిగిపోయిన ప్రాజెక్ట్ ;లతో పాటు పెండింగ్ లో ఉన్న నిధులు కూడా వస్తాయని అందుకే బిజెపి తో టీడీపీ కూటమి పొత్తు పెట్టుకుందని చెపుతున్నారు. కానీ నేతలు మాత్రం తమ స్వలాభం మాత్రమే ఆలోచిస్తున్నారని , అందుకే ఆలా బయటకు వెళ్తున్నారని అంటున్నారు.

Read Also : TS : గృహ జ్యోతికి అప్లై చేసిన బిల్లు వచ్చిందా ..? అయితే కట్టనవసరం లేదు – భట్టి

  Last Updated: 09 Mar 2024, 08:20 PM IST