AP Elections : ఏపీలో కూటమి జోరు..రోజుకు రోజుకు పెరుగుతున్న ప్రజా జోరు

ప్రతి నియోజకవర్గంలో ప్రతి రోజు ఊర్లకు ఊర్లు టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 11:09 PM IST

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూటమి జోరు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రజల నుండి వస్తున్న ఆదరణతో కూటమి నేతలు తమ దూకుడు ను మరింత పెంచుతున్నారు. ప్రజలు సైతం మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు టీడీపీ లోకి భారీగా చేరుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి రోజు ఊర్లకు ఊర్లు టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు. అంతే కాదు కూటమి నేతల ప్రచారంలోనూ 40 డిగ్రీల పైబడిన ఎండలను సైతం లెక్కచేయకుండా పాల్గొంటూ వస్తున్నారు. ప్రజలు తమపై చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. ఈరోజు రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ అమ్మా ప్రసాద్ ఉండవల్లి నివాసంలో లోకేశ్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 100 కుటుంబాలు లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. అమ్మా ప్రసాద్ వైసీపీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేశారు. వైసీపీ విధానాలు నచ్చక పార్టీకి, తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు తెలిపాయి. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బీసీ సెల్ నగర అధ్యక్షుడు, వడ్డెరసంఘ నేత పల్లపు శివరామకృష్ణ, పాదాల మధు, అబ్ధుల్ ఖాన్, అబ్దుల్ ఖాన్, కాటమాల అశోక్, మహమ్మద్ రఫీ పార్టీలో చేరారు. వారందరికీ లోకేశ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్నివర్గాల ప్రజలు కలసి రావాలని లోకేశ్ కోరారు.

ఇటు జనసేన పార్టీలోకి కూడా భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈసారి వైసీపీ ఓడిపోవడం ఖాయం అంటూ వారంతా డిమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం తన ప్రచారంలో దూకుడు కనపరుస్తూ జగన్ ఫై నిప్పులు చెరుగుతున్నారు. ఇక మే మొదటి వారం లో ప్రధాని మోడీ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబదించిన బిజెపి ప్రకటించింది.

Read Also : CM Jagan: 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు మనవే: సీఎం జగన్