జనసేనతో పొత్తు టీడీపీ లోని ఆశావహుల్ని నిరాశపరుస్తుంది. కనీసం 40 స్థానాలను వదులుకోవాల్సి వస్తుందని దిగాలు పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా టీడీపీ వెళ్ళడానికి అనుకూల వాతావరణం ఉంది. ప్రభుత్వవ్యతిరేక ఓటు చీలితే అధికారంలోకి రాలేము అనే ఈక్వేషన్ కరెక్ట్ కాదని 2019 ఎన్నికల ఫలితం నిరూపిస్తుంది. ఒక వేళ అదే నిజం అయితే మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలి. కానీ ఘోరంగా టీడీపీ ఓడింది. ఇలాంటి అనుభవాలను చూపుతూ టీడీపీ ఒంటరిగా వెళ్ళాలి అని ఆ పార్టీలోని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
జనసేన వల్ల తమకు ప్రయోజనం కలిగితే ఓకే గానీ, క్షేత్రస్థాయిలో నామమాత్రంగా ఉండే ఆ పార్టీ కోసం సీటు త్యాగం చేయడానికి ఎవరూ ముందుకు రారనే చర్చ టీడీపీలో నడుస్తోంది. పొత్తు కుదుర్చుకున్నంత ఈజీగా సీట్ల పంపిణీ ఉండదు. అధికారికంగా పొత్తు ఖరారైతే, సీట్ల పంపిణీ సమయానికి టీడీపీ నుంచి నిరసన గళాలు తప్పక వినిపిస్తాయి.
Also Read: Munugode : ఏపీపై మునుగోడు చిత్రం
పొత్తులో భాగంగా జనసేనాని 50 అసెంబ్లీ సీట్లు అడిగే అవకాశం వుందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కనీసం 35 నుంచి 40 చోట్ల టీడీపీ అభ్యర్థుల గతేంటనేది చర్చనీయాంశమైంది. జనసేనతో పొత్తు వల్ల లాభం ఏ మాత్రమో తెలియదు కానీ, కొన్ని చోట్ల నష్టపోక తప్పదనే చర్చ నడుస్తోంది.కొన్ని సీట్లను జనసేనకే అనే చర్చకు తెరలేచింది. తిరుపతి, అనంతపురం, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నంలలో ఒక్కో సీటు, అలాగే ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధికంగా జనసేన డిమాండ్ చేసే అవకాశం ఉంది.
సొంత పార్టీ కాదంటే పక్క పార్టీలోకి వెళ్లి సీటు దక్కించుకోవడమా? లేక స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి వర్గాన్ని కాపాడుకోవడమా? ఈ రెండింటో ఏదో ఒకటి చేయడానికి టీడీపీ లీడర్లు ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నారు. కొన్ని సర్వే సంస్థల ద్వారా జనసేన నియోజకవర్గాల లిస్ట్ సేకరించింది. ఏ మాత్రం కష్టపడకుండా కింగ్ లేదా కింగ్ మేకర్ కావడానికి పవన్ మాస్టర్ స్కెచ్ వేశారు. టీడీపీ పొత్తు లేకుండా గెలుపు సాధ్యంకాదని తెలుసు. అందుకే వ్యూహం ప్రకారం చంద్రబాబును రంగంలోకి దింపారు. దీంతో టీడీపీ లో ముసలం బయలుదేరింది.
Also Read: KCR Operation Akarsh: కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్.. ఉద్యమ నేతలకు గ్రీన్ సిగ్నల్!