Alliance Game : పొత్తుపై మూడు స్తంభాలాట‌

ఏపీ రాజ‌కీయాల్లోని పొత్తు అంశం (Alliance Game )మూడు స్తంభాలాట మాదిరిగా ఉంది. మూడు పార్టీల మ‌ధ్య దోబూచులాట నెల‌కొంది.

  • Written By:
  • Updated On - July 8, 2023 / 03:07 PM IST

ఏపీ రాజ‌కీయాల్లోని పొత్తు అంశం (Alliance Game )మూడు స్తంభాలాట మాదిరిగా ఉంది. మూడు పార్టీల మ‌ధ్య దోబూచులాట నెల‌కొంది. కేవ‌లం జ‌న‌సేన కోసం చంద్ర‌బాబు బీజేపీని ఆద‌రిస్తున్నారు. ఆ పార్టీకి ఓటు బ్యాంకు లేకపోయిన‌ప్ప‌టికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. క‌మ‌ల‌నాథుల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి సిద్ద‌ప‌డుతున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీకి రాజ‌కీయంగా న‌ష్టం చేసే ప్ర‌య‌త్నం మాదిరిగా పార్టీలోని కీల‌క లీడ‌ర్ల‌ భావ‌న‌. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మాత్రం బీజేపీతో క‌లిసి వెళ్ల‌డానికి సందేహించ‌డంలేదు.

ఏపీ రాజ‌కీయాల్లోని పొత్తు అంశం  మూడు స్తంభాలాట  (Alliance Game ) 

వాస్త‌వంగా బీజేపీకి ఏపీలో ఉన్న ఓటు బ్యాంకు నామ‌మాత్రం. కేవ‌లం 2శాతం మాత్ర‌మే ఉంటుంద‌ని గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నిక‌ల‌, బద్వేల్‌, ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ పాత్ర‌ను గ‌మ‌నిస్తే ఆ పార్టీకి ఉన్న ఆద‌ర‌ణ ఏమిటో తెలుస్తోంది. కానీ, కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల వ్యూహాలు, చ‌తుర‌త దెబ్బ‌కు చంద్ర‌బాబు బీజేపీని వ‌ద‌ల్లేక‌పోతున్నారు. అంతేకాదు, జ‌న‌సేన కోసం బీజేపీని చంక‌న (Alliance Game ) ఎక్కించుకుంటున్నారు.

బీజేపీ బ్లూ ప్రింట్ ఇచ్చింద‌ని వారాహి యాత్రను ప‌వ‌న్

ప్ర‌స్తుతం బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఉంది. ఆ రెండు పార్టీల పొత్తు 2019 ఎన్నిక‌ల త‌రువాత నుంచి కొన‌సాగుతోంది. కానీ, తిరుప‌తి లోక్ స‌భ ఉప ఎన్నికల్లో మిన‌హా ఎప్పుడు క‌లిసి వెళ్లలేదు. క్షేత్ర‌స్థాయి పోరాటాలు కూడా చేయ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం క‌లిసి వెళ్ల‌డానికి సిద్ద‌ప‌డ్డాయి. అందుకే, వారాహి యాత్రను ప‌వ‌న్ చేస్తున్నారు. ఆ మేర‌కు బీజేపీ బ్లూ ప్రింట్ ఇచ్చింద‌ని తెలుస్తోంది. బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ పేరును తిరుప‌లి ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా అప్పుడున్న బీజేపీఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ప్ర‌క‌టించారు. అధిష్టానం త‌లంట‌డంతో బీసీల‌కు సీఎం అభ్య‌ర్థి అంటూ నాలుక మ‌రోలా తిప్పారు. అంత‌టితో ఆ వివాదం.(Alliance Game ) ఆగిపోయింది.

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా పురంధ‌రేశ్వ‌రికి

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విశాఖ వ‌చ్చిన సంద‌ర్భంగా క‌లిశారు. ఆ రోజు నుంచి కామ్ గా ఉన్న ప‌వ‌న్ ఇటీవ‌ల వారాహి ఎక్కారు. ప్ర‌చారాన్ని ఉదృతం చేశారు. మ‌రో వైపు ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలిగా పురంధ‌రేశ్వ‌రికి అప్ప‌గించారు. చ‌క‌చ‌కా జ‌రిగిపోయిన ఈ ప‌రిణామాల‌కు ముందుగా సీఎం రేస్ లో ఉన్నానంటూ ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే, పొత్తు (Alliance Game ) టీడీపీ న‌ష్టం వాటిల్లేలా క‌నిపిస్తోంది. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓడించాలంటే పొత్తు అవ‌స‌ర‌మ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఆయ‌న ఆలోచ‌న‌ను అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి బీజేపీ, జ‌న‌సేన స్కెచ్ వేశాయి. వాటి వ్యూహాంలో చంద్ర‌బాబు ప‌డ్డారా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది.

Also Read : NDA Meeting TDP: ఎన్డీయేలోకి టీడీపీ? జులై 18న ఢిల్లీలో ఎన్డీయే విస్తృత స్థాయి స‌మావేశం.. టీడీపీకి ఆహ్వానం!

ప్ర‌త్యేక హోదాను రాజ‌కీయ అస్త్రంగా 2019 ఎన్నిక‌ల్లో వాడుకున్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. వ్యూహాత్మ‌కంగా ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కొచ్చాలా టీడీపీని రెచ్చ‌గొట్టారు. దీంతో ధ‌ర్మ‌పోరాటం పేరుతో మోడీ మీద చంద్ర‌బాబు తిర‌గ‌బ‌డ్డారు. సీన్ క‌ట్ చేస్తే, 151 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఆ త‌రువాత ప్ర‌త్యేక హోదాను మూల‌న‌ప‌డేశారు జ‌గ‌న్‌. ఎన్డీయేకి బ‌య‌ట నుంచి మ‌ద్ధ‌తు ఇస్తున్నారు. భాగ‌స్వామ్యం లోప‌ల‌కు వెళ్ల‌డానికి మాత్రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. బీజేపీ మీద ఉన్న వ్య‌తిరేకత వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొంప‌ముంచుతుంద‌ని భావిస్తున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం ఎన్డీయే కూట‌మిలో (Alliance Game ) చేర‌డానికి దూకుడుగా ఉన్నారు.

బీజేపీని వ‌దిలేయ‌డానికి ప‌వ‌న్ ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు (Alliance Game )

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. ఆనాడు జ‌న‌సేన‌కు ఏ మాత్రం నిర్మాణం లేదు. కేవ‌లం ప‌వ‌న్ గ్లామ‌ర్ మాత్రం ఉప‌యోగ‌ప‌డింది. గ‌త ప‌దేళ్లుగా జ‌న‌సేన నిర్మాణం ఎంతో కొంత జ‌రిగింది. ఆ పార్టీ అంచ‌నా ప్ర‌కారం 11శాతం ఓటు బ్యాంకు ఉంది. అందుకే, ఆ పార్టీని క‌లుపుకుని పోవాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. కానీ, బీజేపీని వ‌దిలేయ‌డానికి ప‌వ‌న్ ధైర్యం చేయ‌లేక‌పోతున్నారు. అందుకే, బీజేపీతోనూ క‌లిసి ప‌నిచేయడానికి టీడీపీ.(Alliance Game ) సిద్ద‌ప‌డుతోంది.

Also Read : CBN strategy : జ‌గ‌న్ పై కేసీఆర్ `భూ` చ‌క్రాన్ని వ‌దిలిన‌ చంద్ర‌బాబు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి అంతంత మాత్ర‌మే. అందుకే ఆ రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌తో బీజేపీకి పొత్తు అనివార్యం. తెలంగాణ రాష్ట్రంలో కింగ్ క‌వాల‌న్నా, ఏపీలో కింగ్ మేక‌ర్ గా ఎద‌గాల‌న్నా టీడీపీ అవ‌స‌రం బీజేపీకి ఉంది. అందుకే, జ‌న‌సేన పార్టీని బూచిగా చూపుతూ చంద్ర‌బాబుతో గేమ్స్ ఆడుతోంది. ఎక్కువ సీట్ల‌లో పోటీ చేయ‌డానికి గేమ్ ప్లాన్ చేస్తోంది. ఇలా, ప‌ర‌స్ప‌ర అవ‌స‌రాల దృష్ట్యా ఆ మూడు పార్టీల మ‌ధ్య పొత్తు (Alliance Game )విష‌యంలో మూడు స్తంభాలాట జ‌రుగుతోంది.