కేంద్రం గ్రామ పంచాయతీ లకు విడుదల చేసిన 7660 కోట్లు పక్కదోవ పట్టాయి. ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని ఏపీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తుంది. పార్లమెంట్ వేదికగా బయటపడ్డ ఆ నిధుల గురించి చెప్పాలని ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కి సర్పంచులు సంఘం అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
విచిత్రంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వైయస్సార్ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ పంచాయతీ నిధుల గురించి ప్రశ్న వేయడం తో అసలు నిజాలు బయటకు వచ్చాయి.
ఆయన అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 2018 నుంచి 2021 వరకు రూ,,7660 కోట్లు పంపించామని కేంద్రం జవాబు ఇచ్చింది. ఆ రోజు నుంచి నిధుల పక్కదోవ గురించి సర్పంచులు ఆందోళన చేస్తున్నారు.
గ్రామ పంచాయతీల ఖాతాలలో 7660 కోట్ల నిధులు కనిపించడం లేదని రాష్ట్రంలోని 12918 మంది సర్పంచులు ఆరోపణ.
రాష్ట్ర ప్రభుత్వం ఆ 7660 కోట్లు దారి మళ్లించి, తన సొంత అవసరాలకు వాడేసుకుందని సర్పంచుల సంఘం అనుమానిస్తున్నారు.
ఆ 7660 కోట్లు లెక్క నిగ్గు తేల్చాలని, లేకపోతే ఉద్యమం చేస్తామని పెద్దిరెడ్డి కి రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించాడు . నిధుల కొరతతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. పలు ఖాతాల్లో ఉన్న నిధులను వేడేసింది. దాదాపు 25 వేల కోట్లకు లెక్కలేదని పీఏసీ చైర్మన్ పయ్యవుల కేశవ్ ఆరోపిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా మీడియా ముఖంగా బయట పెట్టాడు. తాజాగా పంచాయతీ నిధులు 7660 కోట్ల ఏమయ్యాయని సర్పంచులు నిలదీస్తున్నారు. దీనికి ప్రభుత్వం మాత్రం అన్నిటికి లెక్కలు ఉన్నాయని చెబుతుంది. కానీ రాజ్యాంగ లోని ఆర్టికల్ 70 ప్రకారం పంచాయతీ నిధులు ఇతర అవసరాలకు మళ్లించ కూడదు. కానీ. జగన్ సర్కార్ పెద్ద ఎత్తున పంచాయతీ ల నిధులను మళ్లించిందని ఆరోపణ. వాటిని పంచాయతీలకు ఇవ్వాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం.
AP Panchayat Fund:7వేల కోట్ల పంచాయతీ

minister peddireddy