ఏపీలో కాంగ్రెస్ పార్టీ (Congress) కి భారీ షాక్ తగలబోతోంది. రీసెంట్ గా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) సమక్షంలో కాంగ్రెస్ (Congress) లో చేరిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (RK)..తిరిగి మళ్లీ వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మంగళగిరి నుండి రెండుసార్లు విజయం సాధించిన RK ..ఈసారి కూడా అలాగే విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం సర్వేల ఆధారంగా నియోజకవర్గంలో RK గ్రాఫ్ తగ్గిందని భావించిన జగన్..RK ను దూరం పెడుతూ వచ్చారు. ఇదే క్రమంలో టీడీపీ నుండి వచ్చిన గంజి చిరంజీవి కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈసారి మంగళగిరి నుండి వైసీపీ అభ్యర్థి గా చిరంజీవి ని ఎంపిక చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో RK ..వైసీపీ కి రాజీనామా చేసాడు. RK రాజీనామా చేసిన అనంతరం వెంటనే నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు గంజి చిరంజీవికి అప్పజెప్పారు జగన్.
We’re now on WhatsApp. Click to Join.
అదే సమయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరడం ..ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడం తో మొదటి నుండి వైస్సార్ అభిమాని అయినా RK ..షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. గత కొద్దీ రోజులుగా షర్మిల తో ప్రచారం చేస్తున్న RK ..ఇప్పుడు మళ్లీ వైసీపీ లోకి వచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. రెండు రోజుల కిందట ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆర్కేతో చర్చించారు. విజయ సాయి హామీ తో మళ్లీ వైసీపీ (YCP) లో చేరేందుకు డిసైడ్ అయ్యారు. మరికాసేపట్లో సీఎం జగన్ (CM Jagan) తో ఆర్కే భేటీ కాబోతున్నారు. భేటీ అనంతరం వైసీపీ లో చేరే దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు.
Read Also : Bharat Jodo Nyay Yatra: న్యాయ్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారా..? తాజా అప్డేట్ ఇదే..!