Alla Ramakrishna Reddy : ఆర్కే చేతికి గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు..?

రీసెంట్ గా వైసీపీ (YCP) ని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (Alla Ramakrishna Reddy)…తిరిగి మళ్లీ వైసీపీ లోనే చేరారు. జగన్‌ (Jagan) వద్దకు తిరిగి వెళ్లేదే లేదని తేల్చి చెప్పిన ఆర్కే..రెండు నెలలు గడవకముందే మళ్లీ జగన్ వద్దకు వెళ్లారు. మంగళగిరిలో తనను కాదని, సీఎం జగన్‌ మరొకరిని ఇన్‌ఛార్జిగా నియమించడంతో.. డిసెంబరు 11న వైసీపీ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే.. ‘ఇకపై వైఎస్‌ షర్మిల నాయకత్వంలోనే నడుస్తా’ అంటూ […]

Published By: HashtagU Telugu Desk
Alla Gunuru

Alla Gunuru

రీసెంట్ గా వైసీపీ (YCP) ని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (Alla Ramakrishna Reddy)…తిరిగి మళ్లీ వైసీపీ లోనే చేరారు. జగన్‌ (Jagan) వద్దకు తిరిగి వెళ్లేదే లేదని తేల్చి చెప్పిన ఆర్కే..రెండు నెలలు గడవకముందే మళ్లీ జగన్ వద్దకు వెళ్లారు. మంగళగిరిలో తనను కాదని, సీఎం జగన్‌ మరొకరిని ఇన్‌ఛార్జిగా నియమించడంతో.. డిసెంబరు 11న వైసీపీ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే.. ‘ఇకపై వైఎస్‌ షర్మిల నాయకత్వంలోనే నడుస్తా’ అంటూ ఆమె సమక్షంలో జనవరి 21న కాంగ్రెస్‌లో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

నెల తిరక్కుండానే ఆ పార్టీని వీడి తిరిగి వైసీపీ గూటికి చేరారు. ‘నేను అసలు జగన్‌ వద్దకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు’ అని అప్పట్లో ప్రకటించిన ఆర్కే… రెండు నెలలకే మళ్లీ వైసీపీ పంచన చేరారు. మంగళవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసి మళ్లీ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం ఆర్కే కు అధిష్టానం గుంటూరు పార్లమెంట్ బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు తెలుస్తుంది. గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించాలని YCP భావిస్తోందట. రెడ్డి వర్గానికి ఓ సీటు కేటాయించినట్లు ఉంటుందని లెక్కలేస్తోంది. ఇటు తెనాలి సీటును మారుస్తారనే ప్రచారం సాగుతోంది. సినీ నిర్మాత, కాపు వర్గానికి చెందిన దాసరి కిరణ్ కు ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. ఇక ఆర్కే చేరడం పట్ల మాత్రం నియోజకవర్గ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెలకోసారి మాట మార్చే వ్యక్తులు ఈసారి నమ్మేదే లేదంటున్నారు.

Read Also : Etela: అధిష్ఠానం ఆదేశిస్తే..మల్కాజిగిరి నియోజకవర్గం బరిలో దిగుతా: ఈటల

  Last Updated: 21 Feb 2024, 01:47 PM IST