Site icon HashtagU Telugu

TDP : మంగళగిరి లో టీడీపీ కి మరోసారి భంగపాటు తప్పదు – ఆర్కే

Rk Lavany

Rk Lavany

మంగళగిరి (Mangalagiri) లో టీడీపీ (TDP) కి మరోసారి భంగపాటు తప్పదని , వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు ఆళ్ల రామకృష్ణ రెడ్డి (Alla Ramakrishna Reddy). శుక్రవారం రాత్రి వైసీపీ అధిష్టానం 9వ జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా లావణ్య (Lavanya) ను ప్రకటించారు. అంతకు ముందు గంజి చిరంజీవి ని ప్రకటించడం తో..ఆయన తన ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను సీఎం జగన్ నియమించారు.

We’re now on WhatsApp. Click to Join.

లావణ్య నియామకంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చెప్పిన విధంగానే మంగళగిరి సీటు గెలిపించి జగనన్నకు కానుక ఇస్తామని ఆర్కే పేర్కొన్నారు. టీడీపీ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని, లోకేష్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో నాన్ లోకల్, బీసీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యానించారు. లావణ్య తల్లి కాండ్రు కమల 2009 నుంచి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు మంగళగిరి మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌గానూ పనిచేశారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా, ఎథిక్స్ కమిటీ చైర్మ‌న్‌గా ఉన్నారు. అంతకుముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఇలా లావణ్య కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడం తో ఆమెను అభ్యర్థిగా జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మరి నియోజకవర్గ ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది చూడాలి.

Read Also : Balakrishna Raviteja : వెంకటేష్ సినిమాలో బాలయ్య, రవితేజ..!