Volunteers Issue: వాలంటరీర్ల జోలికి వస్తే అంతు చూస్తాం

వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు

Volunteers Issue: వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. ప్రజల డేటాని సేకరించి ఒంటరి మహిళలను టార్గెట్ చేసి రవాణాకు పాల్పడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశ్చర్యానికి గురి చేశాయి. అసలు వాలంటీర్లకు, మహిళల అక్రమ రవాణాకు సంబంధం ఏంటని ప్రశ్నించారు ఏపీ మాజీ మంత్రి ఆళ్ళ నాని. ఈ రోజు ఆదివారం ఆళ్ళ నాని మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు.

ఏలూరు వారాహి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఆళ్ళ నాని గుర్తు చేసుకున్నారు. వాలంటీర్లపై అసత్యపు ప్రచారాలు చేసినా, వాళ్ళ జోలికి వచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు నాని. పవన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ని పట్టుకుని పవన్ అసత్యపు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. వాలంటీర్లు, సీఎం జగన్ జోలికి వచ్చినా, అసత్యపు మాటలు మాట్లాడినా సహించేది లేదని ధ్వజమెత్తారు ఆళ్ళ నాని. దూషణల చేయడం వల్ల ప్రజల్లో చులకన చేయాలని, అప్రతిష్ఠపాలు చేయాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ కుట్ర చేస్తున్నారని మణిపడ్డారు. కుట్రలు ఫలించకపోవడంతోనే పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

సామాన్యులకు వాలంటరీ వ్యవస్థ వరంలా మారిందని, అవినీతికి తావు లేకుండా వాలంటరీ వ్యవస్థ పని చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పధకం పేదలకు అందించడానికి పారదర్శకంగా వాలంటరీ వ్యవస్థ నడుస్తుందని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి వాలంటరీ వ్యవస్థపై విషం కక్కుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆళ్ళ నాని.

Read More: Air India: ఎయిర్ ఇండియా అధికారిపై దాడి చేసిన ప్రయాణికుడు.. చివరికి?