Site icon HashtagU Telugu

Alla Nani : వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆళ్ల నాని

Alla Nani Resigned From Ysr

Alla Nani Resigned From Ysr

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan) కు వరుస షాకులు ఇస్తున్నారు పార్టీ నేతలు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ నుండి ఇంకా పూర్తిస్థాయి లో తేరుకోకముందే పార్టీ నేతలు వరుసపెట్టి పార్టీకి దూరం అవుతున్నారు. ఎన్నికల సమయంలో పలువురు నేతలు పార్టీని వీడి జనసేనా , టిడిపి లలో చేరగా..ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చేసరికి వైసీపీ నేతలంతా టిడిపి , జనసేన లో చేరేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. రీసెంట్ గా పలువురు చేరగా…తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని (Alla Nani Resigned to YCP) వైసీపీ కి రాజీనామా చేసారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆళ్ల నాని తెలిపారు. గెలుపు ఓటములకి అతీతంగా ఏలూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఇకపై వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. తన రాజీనామా కేవలం తన వ్యక్తిగతం మాత్రమేనని ఆళ్ల నాని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఏలూరులో పార్టీ ఆఫీస్ కూల్చివేతపై వచ్చిన ఆరోపణలు కేవలం అపోహలు మాత్రమేనని అన్నారు. గత ఏడాదిగా పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఈ విషయం పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డికి కూడా తెలుసని అన్నారు. ఈ నెల 16 వ తేదీన యజమాని స్థలాన్ని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారని ఆళ్ల నాని తెలిపారు. ఇందులో ఎలాంటి ఆరోపణలుకి తావు లేదని వివరించారు. ఇటీవలే ప.గో. జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవుల నుంచి నాని తప్పుకున్న విషయం తెలిసిందే.

Read Also : Ram Charan : మెల్‌బోర్న్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రామ్ చరణ్