ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Meetings) ఈరోజు నుండి మొదలయ్యాయి. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆధ్వర్యంలో బడ్జెట్ ను రూపొందించగా..మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) బడ్జెట్ (AP Budget 2024 )ను అసెంబ్లీ లో ప్రవేశపెట్టారు. రూ.2,94,427 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తెచ్చారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.35 లక్షల కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.32,712 కోట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఎప్పటిలాగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్..అసెంబ్లీ కి రాకుండా ఇంట్లోనే టీవీ లలో బడ్జెట్ లైవ్ చూస్తుండడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసెంబ్లీ(Assembly)కి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ(YCP) ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఇంట్లో కాదు..ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండని తెలిపింది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తాలని, అసెంబ్లీని వదిలి బయటకే పరిమితం కాకుండా ప్రజాస్వామ్య సమస్యల పట్ల శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీని ప్రజాస్వామ్య దేవాలయంగా కొలిచిన షర్మిల.. అక్కడ ప్రజల పక్షాన నిలబడి సమస్యలను అధికార పక్షాన్ని నిలదీసే అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, మహిళలపై దాడులు ఆగడం లేదన్నారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని, బెల్టు షాపుల దందాను అరికట్టలేదని, 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదని, రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే…ప్రతిపక్షం ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం అనడం సిగ్గు చేటన్నారు.
1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదని, మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదని, 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డారని, ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపించిందని గుర్తు చేశారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదని, హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని, నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారని, దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారిందని చెప్పుకొచ్చారు.
Read Also : Tunnel Under Cemetery : సమాధుల కింద రహస్య సొరంగం.. భారీగా ఆయుధాలు