AP Cabinet: ఏపీ మంత్రులు అంద‌రూ రాజీనామా!

సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశం ముగిసిన త‌రువాత మూకుమ్మ‌డిగా మంత్రులు రాజీనామా చేశారు.

  • Written By:
  • Updated On - April 8, 2022 / 12:12 PM IST

సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశం ముగిసిన త‌రువాత మూకుమ్మ‌డిగా మంత్రులు రాజీనామా చేశారు. రాజీనామా ప‌త్రాల‌ను జ‌గ‌న్ కు అందించారు. వాటిని గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ కు పంపించ‌నున్నారు. ఎవ‌రికి వారే క్యాబినెట్ స‌మావేశం ముగిసిన త‌రువాత కాన్వాయ్ ను వ‌దిలేసి సొంత వాహ‌నాల్లో వెళ్లిపోయారు. కొంద‌రు మంత్రులను మ‌ళ్లీ మంత్రివ‌ర్గంలోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఆ విషయాన్ని క్యాబినెట్ మీటింగ్ లో జ‌గన్ చెప్పార‌ని భేటీ ముగిసిన త‌రువాత బ‌య‌ట‌కొచ్చిన మంత్రులు చెబుతున్నారు. సమావేశంలో 36 అంశాలు అజెండాగా చేర్చారు. ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను కెబినేట్ తీసుకుంది. అయితే ప్ర‌ధానంగా మంత్రుల రాజీనామా విష‌యం హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రులంతా త‌మ లెట‌ర్ హెడ్‌ల‌పై రాజీనామాల‌ను సీఎం జ‌గ‌న్ కు అందించారు. గ‌వర్న‌ర్ ఈ రాత్రికి రాజీనామాల‌ను ఆమోదించే అవ‌కాశం ఉంది. ఈ నెల 10వ తేదీన కొత్త మంత్రుల జాబితా విడుద‌ల కానుంది.

ఈనెల 11 న కొత్త మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారం జ‌ర‌గ‌నుంది. రాజీనామా చేసిన మంత్రుల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి ఏ నిర్ణ‌యం తీసుకున్న ఆ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని కొడాలి నాని తెలిపారు. కొత్త కేబినెట్లో కుల స‌మీక‌రణాల ఆధారంగా జాబితా ఉండ‌నుంది. సంతోషంగా, ఆనందంగా రాజీనామాలు చేశామ‌ని సిదిరి అప్ప‌ల‌రాజు తెలిపారు. పార్టీకి సేవ చేయ‌డం చాలా గొప్ప‌ విష‌యమ‌ని.. పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తామ‌ని ఆయ‌న మంత్రులు అంటున్నారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ త‌రువాత సీఎం జ‌గ‌న్ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. ఉమ్మ‌డి ఏపీలో ఒక‌సారి 31 మంది మంత్రుల రాజీనామాల‌ను ఎన్టీఆర్ తీసుకున్నారు. మంత్రిమండ‌లిని ర‌ద్దు చేసి ఆనాడు చ‌రిత్ర సృష్టించారు. మ‌ళ్లీ విభ‌జిత ఏపీలో జ‌గ‌న్ 24 మంత్రుల వ‌ద్ద రాజీనామా ప‌త్రాలు తీసుకుని స‌రికొత్త పంథాను ఎంచుకున్నారు. కొత్త మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌డానికి క‌స‌రత్తు ముగిసింది. రాజీనామాలు చేసిన సీనియ‌ర్లు ఏమి చేస్తారో చూడాలి.