Site icon HashtagU Telugu

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, పర్యాటక ప్రాంతాలకు నో పర్మిషన్

Tirumala Tirupati Devastanam Ttd

Tirumala Tirupati Devastanam Ttd

TTD: వర్షం వల్ల తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. పాపవినాశనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు అనుమతి నిరాకరించారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో TTD నిర్ణయం ఈ తీసుకుంది. తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలను టీడీడీ సిబ్బంది తొలగించింది.

కాగా తిరుపతితో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది, ముంపు ప్రమాదంలో శ్రీకాళహస్తి సమీప లంకమిట్ట కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరదయ్యపాలెం పంచాయతీ గోవర్ధన పురం వద్ద పాముల కాలువ, కడురు వద్ద సున్నపు కాలువ, సీఎల్ఎన్ పల్లి వద్ద పాముల కాలువ, పాండురు వద్ద రాళ్లవాగు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటి ప్రవాహ ఉద్ధృతికి రాకపోకలు స్తంభించాయి.

కాగా తుఫాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సమీక్షించారు. తీసుకోవాల్సిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Also Read: AP News: మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దు