Alapati Rajendra Prasad : టీడీపీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఆలపాటి రాజేంద్రప్రసాద్..?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి టికెట్ ఆశించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. పొత్తులో భాగంగా ఆ టికెట్ కు జనసేనకు కేటాయించారు చంద్రబాబు (CBN). తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ (Manohar) పోటీ చేయనున్నారు

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 04:48 PM IST

టీడీపీ ఈరోజు 11 ఎమ్మెల్యేలు, 13 ఎంపీ అభ్యర్థులతో కూడిన మూడో జాబితా (టీడీపీ ౩ర్డ్ List) ను రిలీజ్ చేసింది. ఎప్పటిలాగానే జాబితా రిలీజ్ అవ్వగానే ఆశావహులు అధిష్టానం ఫై అసమ్మతి సెగలు మొదలుపెట్టారు. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో బరిలోకి దిగనున్న టీడీపీ.. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఈరోజు తాజాగా మరో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. అయితే, టీడీపీ తాజా జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో చిచ్చు పెట్టింది. ఈ జాబితాలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ (Alapati Rajendra Prasad )కు చోటు దక్కలేదు. టీడీపీ తనకు టికెట్ కేటాయించక పోవడంపై ఆలపాటి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీకి రాజీనామా చేసి..వైసీపీ లో చేరాలనే ఆలోచన చేస్తున్నారని వినికిడి.

We’re now on WhatsApp. Click to Join.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి టికెట్ ఆశించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. పొత్తులో భాగంగా ఆ టికెట్ కు జనసేనకు కేటాయించారు చంద్రబాబు (CBN). తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ (Manohar) పోటీ చేయనున్నారు. గుంటూరు లో టీడీపీకి కీలక నేతగా ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ క్రమంలో ఈరోజు తన అనుచరులతో భేటీ అయ్యారు ఆలపాటి రాజేంద్రప్రసాద్. టికెట్ రాకపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తన ముఖ్య అనుచరులతో భేటీ అయినట్లు సమాచారం. ఒకవేళ రాజేంద్రప్రసాద్ రాజీనామా చేస్తే గుంటూరు లో టీడీపీ కి భారీ దెబ్బ పడనుంది.

తెనాలి, గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు లాంటి నియోజకవర్గాలపై ఆ ప్రభావం పడుతుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఆలపాటి రాజా ఆగ్రహంతో ఉన్నారన్న వార్తలు గుప్పమన్న నేపథ్యంలో.. రంగంలోకి దిగింది టీడీపీ అధిష్టానం. రాజీనామా చేస్తారన్న ప్రచారంతో ఆలపాటి వద్దకు చేరుకున్నారు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, జనసేన IOS బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పలువురు టీడీపీ నాయకులు.. ఆలపాటి రాజాకు సర్దిచెప్పే పనిలో పడిపోయారు నేతలు.. అయితే, ఆలపాటి వెనక్కి తగ్గుతారా? లేదా? అనేది చూడాలి.

Read Also : Delhi Liquor Scam : కేజ్రీవాల్‌కు రూ.600 కోట్ల ముడుపులు అందాయి – ఈడీ