Site icon HashtagU Telugu

AP Congress : ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్‌.. 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు..?

Jai Congress

Jai Congress

ఏపీలో త‌న ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతుంది. ఏపీ విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప‌దేళ్లుగా ఉనికిని కోల్పోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అక్క‌డా ప‌దేళ్లు పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ప‌దేళ్ల త‌రువాత తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఫోక‌స్ అంతా ఏపీపైనే పెట్టింది. ఏపీలో క‌నీసం 10 స్థానాలు గెలిచి అసెంబ్లీలో ఉండాల‌నే భావ‌న‌లో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. క్రిందిస్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేయాల‌ని అధిష్టానం ఆలోచ‌న చేస్తుంది. అయితే ఎన్నిక‌లకు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌టంతో కార్య‌చ‌ర‌ణ‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లను నియమించింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసీసీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇటీవల న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) నేతలతో ఏఐసీసీ సమావేశమైంది. ఆదివారం ఏఐసీసీ లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్తల జాబితాను విడుదల చేసింది. ఏపీసీసీ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తల నేపథ్యంలో కోఆర్డినేటర్లను నియమించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, ఇతర నేతలు విజయవాడలో మూడు రోజులపాటు సమావేశమై పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించారు. అరకు (ఎస్సీ) పార్ల‌మెంట్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా – జగతా శ్రీనివాస్, శ్రీకాకుళం – మీసాల సుబ్బన్న, విజయనగరం – బొడ్డేపల్లి సత్యవతి, విశాఖపట్నం – కొత్తూరి శ్రీనివాస్, అనకాపల్లి – సనపల అన్నాజీ రావు, కాకినాడ – కెబిఆర్ నాయుడు, అమలాపురం (ఎస్సీ) – ఎం వెంకట శివ ప్రసాద్. రాజమహేంద్రవరం – ఎం రామకృష్ణ, నరసాపురం – జెట్టి గురునాధరావు, ఏలూరు – కనుమూరి బాపిరాజు, మచిలీపట్నం – కొరివి వినయ్ కుమార్. విజయవాడ – డి మురళీ మోహనరావు, గుంటూరు – గంగిశెట్టి ఉమా శంకర్, నరసరావుపేట – వి గురునాధం, బాపట్ల (ఎస్సీ) – శ్రీపతి, ఒంగోలు – యు వెంకటరావు యాదవ్, నంద్యాల – బండి జకారియా, కర్నూలు – పిఎం కమలమ్మ, అనంతపురం – ఎన్ శ్రీహరి ప్రసాద్, హిందూపూర్ – షేక్ సత్తార్, కడప – ఎం సుధాకర్ బాబు, నెల్లూరు – ఎం రాజేశ్వరరావు, తిరుపతి – షేక్ నాజర్ అహ్మద్, రాజంపేట – ఎన్ తులసి రెడ్డి, చిత్తూరు – డి రాంభూపాల్ రెడ్డిల‌ను స‌మ‌న్వ‌యక‌ర్త‌లుగా నియ‌మించింది. ఈ నేతలు తమ జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటారని ఏఐసీసీ తెలిపింది.

Also Read:  Kesineni : బెజ‌వాడ టీడీపీకి మ‌రో షాక్‌… కార్పోరేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న కేశినేని శ్వేత