Agniveer : ఆర్మీలో ఉద్యోగం చేయాలని భావించే ఆంధ్రప్రదేశ్ యువతకు మంచి అవకాశం. ఇందుకోసం అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీకి కడప నగరంలోని డీఎస్‌ఏ స్టేడియం వేదికగా నిలువనుంది. నవంబరు 10 నుంచి 15 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్/ స్టోర్ కీపర్, టెక్నికల్ ట్రేడ్‌మెన్ (టెన్త్ పాస్), ట్రేడ్‌మెన్ (ఎనిమిదో తరగతి పాస్) విభాగాల కోసం అగ్నివీర్‌లను ఎంపిక చేస్తారు.
Also Read :Dumstick Benefits : మునగ మగవారికే కాదు స్త్రీలకు కూడా ఎంతో మేలు చేస్తుందని తెలుసా..?
అయితే ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఏపీలోని అన్ని జిల్లాల వారికి ఛాన్స్ లేదు. కర్నూలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్‌ఆర్, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల, బాపట్ల, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలి. అంటే 13 జిల్లాల అభ్యర్థులకే(Agniveer) అవకాశం ఉంది. ఆర్మీ ర్యాలీ కోసం అప్లై చేసుకొని అడ్మిట్ కార్డులు పొందినవారు ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. అడ్మిట్ కార్డులు, సంబంధిత సమాచారం కోసం అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను చూడొచ్చు. మెరిట్ ప్రకారం అభ్యర్థులను వివిధ రౌండ్లకు ఎంపిక చేయనున్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని అధికారులు స్పష్టం చేశారు.
Also Read :Health Tips : నెల రోజులు పళ్ళు తోమకుంటే ఏమవుతుంది..?
ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆర్మీ ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దానిలో సూచించిన మేరకు అన్ని డాక్యుమెంట్లను అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్‌గా జరగనుంది. ఉద్యోగ ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రదర్శన ఉంటేనే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్‌కు అప్లై చేసిన వారికి తొలుత 1,600 మీటర్ల రన్నింగ్ పోటీ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని ఇతర ఈవెంట్లు, పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఈవిధంగా రోజుకు వెయ్యి మందిని తదుపరి ఈవెంట్లకు ఎంపిక చేస్తారు. ర్యాలీలో ఎంపికయ్యే వారికి ఆర్మీ శిక్షణ లభిస్తుంది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో పోస్టింగ్‌లు కేటాయిస్తారు.