Aghori Met Car Accident: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిని అఘోరీ (Aghori Met Car Accident) మాత ప్రస్తుతం ఏపీలో కలకలం సృష్టిస్తున్నారు. నిన్న పుఠాపురంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న అఘోరీ మాత నేడు శ్రీకాళహస్తి ఆలయం వద్ద హల్‌చల్ చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్లేందుకు అఘోరీ మాత ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డులు అఘోరీ మాతను అడ్డుకుని లోపలకి వెళ్లనివ్వలేదు. దీంతో అఘోరీ మాత ఆగ్రహించి తన కారులో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మార్పణకు ప్రయత్నించారు. అయితే స్థానిక భక్తులు, పోలీసులు అఘోరీ మాత్ర ఆత్మహత్యాయత్నంను నివారించగలిగారు. అఘోరీ మాతను ఆలయంలోకి వెళ్లేందుకు నిరాకరించడంతో మనస్తాపానికి గురైనట్లు ఆమె వివరించారు.
అయితే సామాన్య భక్తుల లాగే అఘోరీ మాత కూడా నియమాలు పాటించాలని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. దిగంబరంగా ఆలయంలోకి వెళ్లనివ్వమని వారు చెప్పారు. అయితే ఆ విషయం తనకు తెలియదని అఘోరీ మాత చెప్పారు. దీంతో వివాదం కాస్త సదుమణ్గింది.
Also Read: Donald Trump: వైట్‌హౌస్‌కు ట్రంప్ ఎప్పుడు వెళ్తారు..? అప్పటివరకు ఏం జరగనుంది?
అఘోరీ మాత కారుకు ప్రమాదం?
ఈ వివాదం తర్వాత పోలీసులు అఘోరీ మాతను ఏపీ నుంచి పంపే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అఘోరీ మాత కారుకు ప్రమాదం జరిగినట్లు ఆమె చెబుతున్నారు. పోలీసులు బలవంతంగా తనను రాష్ట్రం నుంచి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేస్తున్న తరుణంలోనే తన కారు నేషనల్ హైవేపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టిందని చెబుతున్నారు. దీంతో తన కారు ప్రమాదానికి పోలీసులే కారణమని అఘోరీ మాత ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇబ్బంది పెట్టకుంటే తన కారుకు ప్రమాదం జరిగేది కాదని, పోలీసులే పో పో పో అని ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన కాసేపటికి అక్కడికి ఇతర వాహనదారులు రావడంతో అఘోరీ అక్కడ్నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. కారుకు ప్రమాదం జరిగినా చీకట్లోనే అఘోరీ ప్రయాణం మొదలు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కారుకు ప్రమాదం శ్రీకాళహస్తి నుంచి విజయవాడ వస్తుండగా జరిగినట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.