Site icon HashtagU Telugu

Chittoor: దీనావస్థలో గజరాజులు.. ఆపన్నహస్తం అందించేదెవరు!

Elephants

Elephants

జయంత్ (65), వినాయక్ (52) (శిక్షణ పొందిన ఏనుగులు) చిత్తూరు జిల్లాలో రెండు దశాబ్దాలకు పైగా అటవీ శాఖలో పనిచేశాయి. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకుప్పం వద్ద కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యంలోని నానియాల అటవీ శిబిరంలో ఉన్న ఈ రెండు మగ ఏనుగులు అవసాన దశలోకి వచ్చాయి. ఈ ఏనుగులు అటవీ అధికారుల ప్రేమ, అప్యాయతను చూరగొనడంతో పాటు ఎన్నో కార్యకలాపాలను నిర్వహించడంలో సమర్థవంతంగా నిర్వహించాయి.

జయంత్ అనే ఏనుగు తమిళనాడు, కర్ణాటకల మధ్య ఉన్న ట్రై-స్టేట్ జంక్షన్ ఏనుగు కారిడార్‌లో అడవిగా జన్మించింది. రెండు దశాబ్దాల జంక్షన్ నుంచి బయటకు రాగా.. కొన్నాళ్లకు విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు షిఫ్ట్ అయ్యింది. ఇక వినాయక్ అనే ఏనుగు విశాఖపట్నం-చిత్తూరు జీవనం కొనసాగించింది. చాలా మంది మహోత్‌లు, వారి సహాయకులతో అప్యాయంగా మెలిగింది.

కౌండిన్య అభయారణ్యం అడవి మందలను, తమిళనాడు, కర్ణాటక నుండి వలస వచ్చిన అటవీ జంతువులను నియంత్రించడానికి, అసంఖ్యాక కార్యకలాపాలకు అటవీ అధికారులు ఈ రెండు ఏనుగుల ద్వారా చెక్ పెట్టగలిగారు. శేషాచలం కొండల్లోని తలకోన అడవుల్లోని అడవి మందలను తరిమికొట్టడంతోపాటు, పంటలపై దాడి చేసే జంతువులను ఆరికట్టగలిగాయి. నానియాల క్యాంపులో ఉన్న ఈ రెండు ఏనుగులకు ప్రతి సంవత్సరం ₹10 లక్షలు ఖర్చయింది. అడవుల్లో షికారు చేయించడం, వాటికి అవసరమైన బలమైన ఆహారం అందించేందుకు ఇంత మొత్తంలో ఖర్చవుతుంది. ప్రస్తుతం ఈ ఏనుగులు అవసాన దశలోకి ప్రవేశించడంతో, వాటి  శ్రద్ధపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే దాతల సహయసహకారాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.