Site icon HashtagU Telugu

Vizianagaram: ఆదిమూలం ఆదేశం.. కీచక గురువులపై వేటు!

Adimulam

Adimulam

బాలికల పట్ల ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం ఏజెన్సీలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం.. ప్రాథమిక పాఠశాల ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయులపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. ప్రధానోపాధ్యాయుడు స్వామినాయుడు, ఉపాధ్యాయుడు సూర్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే వారిని సస్పెండ్ చేసి విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ అనంతరం క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా మంత్రి సురేష్ సూచించారు.

ఈ ఘటనపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో కలెక్టర్‌ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసి శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల అసభ్యకరంగా ప్రవర్తించారు. అయితే బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. దీనిపై తీవ్రంగా స్పందించిన జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఇద్దరిని సస్పెండ్ చేస్తూ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది.