తిరుపతి ఎంపీ సీటు దాదాపుగా 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి గెలుపు అన్నది లేని లోక్‌సభ నియోజకవర్గం అది మొదట్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైసీపీ వరుసగా గెలుస్తున్నాయి. అలాంటి సీట్లు వైసీపీ టికెట్ ఇస్తే ఎగిరిగంతేస్తారు ఏ నాయకుడైనా. కానీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం (Adimulam Koneti) మాత్రం నాకు దాన్ని తిరస్కరించారు. పైగా తన సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదంటూ సైకిల్ ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ఎపిసోడ్ చిత్తూరు జిల్లా వైసీపీని కుదిపేస్తుండగా.. అధికార పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయని మానసిక క్షోభపడ్డానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డిపై తిరుగుబాటు చేసిన తీరు గురించి పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంత వరకు వైసీపీ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, ఆస్థా ఇతర నేతలెవరూ అధిష్టానాన్ని ధిక్కరించిలేదు. ప్రాధాన్యత ఇవ్వలేదని ఒకరిద్దరు పార్టీని వీడినా అధిష్టానాన్ని తప్పు పట్టలేదు. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషాకు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు టికెట్ లేదన్నా.. పార్టీకి వ్యతిరేకంగా పెదవి విప్పలేదు. తిరుపతి సిట్టింగ్ ఎంపీని సత్యవేడు అసెంబ్లీకి పోటీ చేయమని ఆదేశించిన ఆయన సైతం నోరు మెదపకుండా సత్యవేడులో పర్యటనలు ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
జీడీనెల్లూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణస్వామికి టికెట్ లేదని.. చిత్తూరు ఎంపీగా పోటీ చేయమని ఆదేశిస్తే డిప్యూటీ సీఎం గా ఉండి ఎంతో సీనియర్ అయిన కూడా ఆయన శిరసావహించారు. చిత్తూరు ఎంపీకి సైతం టికెట్ ఇవ్వకుండా జీడీ నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే కామ్ గానే ఉన్నారు. ఇక పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు టికెట్ తిరస్కరించిన వెంటనే మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. కానీ అంతలోనే తొందర పడ్డానంటూ క్షమాపణలు చెప్పారు. అయినా ఇలా ఎవరికి వారు అధిష్టానం ఆదేశాలను పాటిస్తున్న టైంలో జిల్లా ఎస్సీల్లో పట్టున్న ఆదిమూలం ధిక్కార స్వరం వినిపించడం, పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదట. మీ టికెట్ లేదని చెప్పినా అంతకంటే పెద్ద స్థాయిలో తిరుపతి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది ఆయనకు.. పైగా అది పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్న సీటు అనేది విశ్లేషకుల అభిప్రాయం. అలాంటి సీటును తిరస్కరించడం అంతటితో ఆగకుండా ఏకంగా పార్టీని వదిలేసి లోకేష్ ను కలవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట వైసీపీ పెద్దలు.
అదే సమయంలో ఆదిమూలం తిరుగుబాటుపై ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతోందట. తనకు పదవి అధికారం కంటే గౌరవ ముఖ్యమంత్రి వైసీపీలో అవమానాలు భరించలేకపోతున్నానని ఆదిమూలం చెప్పడం జిల్లాలో ఎస్సీ వర్గాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారట చిత్తూరు వైసీపీ నాయకులు. తన తప్పేమీ లేకున్నా అవినీతి అభాండాలు వేయడం తనకు తెలియకుండా సమావేశాలు పెట్టడం, సిట్టింగ్ సీటును నిరాకరించడాన్ని ఏమనుకోవాలి అని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆదిమూలం. తనకిచ్చిన ఎంపీ అవకాశం కంటే ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆయన మాటగా ప్రచారం జరుగుతోంది.
Read Also : Nirmala Sitharaman : శుభవార్త చెప్పిన నిర్మలమ్మ.. ఆదాయపు పన్ను శ్లాబ్‌లో ఎలాంటి మార్పు లేదు