Site icon HashtagU Telugu

Adani Group : గత వైసీపీ ప్రభుత్వం తో 200 మిలియన్ డాలర్లతో అదానీ ఒప్పందం..?

Ys Jagan Government In Gaut

Ys Jagan Government In Gaut

భారతదేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ (Adani Group) పై కీలక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోలార్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఓ భారీ డీల్ కుదుర్చుకునేందుకు.. ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ అమెరికా ఆరోపణలు చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆర్థిక నియంత్రణ సంస్థలు దీనిపై దర్యాప్తు ప్రారంభించాయి.

గౌతం అదానీ (Gautam Adani), ఆయన మేనల్లుడు సాగర్ అదానీ (Sagar Adani) సహా మరో ఏడుగురు అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లు వివిధ రాష్ట్రాల అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఇచ్చారని అమెరికా కోర్టులో కేసు నమోదైంది. పలు రాష్ట్రాల్లో గుర్తు తెలియని అధికారులకు వేలకోట్లు చేతులు మారాయని ఆరోపణలు చేసింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత ఖర్చుతో కూడుకున్న సౌర విద్యుత్ అంటగట్టేందుకు అదానీ గ్రూప్ ప్రతినిధులు ప్రయత్నించారని యూఎస్ కోర్ట్ లో పలు పిర్యాదులు అందాయి.

2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటే, ఒడిశా 500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, ఛత్తీస్ గడ్ ప్రభుత్వాలతోనూ 2021 జూన్ నుంచి 2021 డిసెంబర్ మధ్య సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందాలు కుదిరాయి. అలాగే ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న అజూర్ పవర్ మీద అభియోగాలు నమోదయ్యాయి.

అమెరికా అభియోగాల ప్రకారం.. ఆదాని గ్రూప్ 265 మిలియన్ డాలర్ల అవినీతిని చేసిందని.. ఇందులో ఎక్కువ భాగం ఏపీ అధికారులకు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడంతో ఆ ముడుపుల్లో చాలావరకు జగన్ ముట్టాయని ఆరోపణలు వస్తున్నాయి.

అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ (SEC) ఫిర్యాదు ప్రకారం.. 2021 ఆగస్టులో గౌతమ్ అదానీ అప్పటి సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలుసుకుని, రాష్ట్రానికి 7Gigawatt (GW) సౌర విద్యుత్‌ సరఫరా ఒప్పందానికి సంబంధించిన లంచాల విషయం చర్చించారని పేర్కొంది. ఈ ఫిర్యాదులో గౌతమ్ అదానీ.. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో రూపాయల 1,750 కోట్ల లంచం (MWకు రూ. 25 లక్షలు) చెల్లించేందుకు వాగ్దానం చేశారని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు SECIతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.

Jagan Adani 1

ఒప్పంద వివరాలు :

2021 డిసెంబర్‌ 1న APSPDCL, APEPDCL, APCPDCL డిస్కంలు SECIతో 7 GW సౌర విద్యుత్‌ సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..2024లో 3 GW, 2025లో 3 GW, 2026లో 1 GW విద్యుత్‌ సరఫరా జరగాలి. ఈ విద్యుత్‌ను రైతులకు రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఒప్పందాల వల్ల ఏపీ సర్కార్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని , ప్రజలపై పెను భారం పడిందని తెలుస్తుంది. అలాగే ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న అజూర్ పవర్ మీద అభియోగాలు నమోదయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : BRS: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న “దీక్షా దివస్”: పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు