Actress Madhavi Latha Fire on Home Minister Anitha : రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu State) గణేష్ నవరాత్రుల (Ganesh Navratri) సందడి మొదలైంది. ఊరూవాడ జైజై గణేశా అంటూ ఆ విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆ లంబోదరుడికి పూజలు చేసి భక్తులు తరించనున్నారు. ఈ క్రమంలో ఏపీలో గణేశ్ మండపాలకు వివిధ రకాల చలాన్లు విధిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భక్తులు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై సినీ నటి , బిజెపి నేత మాధవీలత (Madhavi Latha) సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని హోమంత్రి అనిత (Home Minister Anitha) ను నిలదీశారు. అన్ని మతాలు, పండుగలు సమానమని.. కానీ హిందూ పండగలపైనే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ.. మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అనితక్కా.. ఏందినీ తిక్క.. ఈ కూటమిలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తానని మాధవీలత పేర్కొన్నారు. ప్రతీ వాళ్లకు హిందూ పండగలపై పడి ఏడవడం తప్ప పనిలేదా అంటూ రెచ్చిపోయారు. మైక్ పర్మిషన్ కు 100 రూపాయలు, విగ్రహాలకు 350 ఇవ్వాలా ? ఇదే రూల్ ముస్లింలు, క్రిస్టియన్లకు పెట్టండి అంటూ మాధవీలత హోంమంత్రికి ఉచిత సలహా కూడా ఇచ్చారు.
Read Also : BJP Membership Drive : 50 లక్షల మెంబర్షిప్ టార్గెట్ గా బీజేపీ..