Actor Suman : మంత్రి నారా లోకేష్ తో యాక్టర్ సుమన్ సమావేశం

ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా చాలామంది సినీ ప్రముఖులు వచ్చి కూటమి నేతలను అభినందించారు

Published By: HashtagU Telugu Desk
Suman Nara Lokesh

Suman Nara Lokesh

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి సినీ ప్రముఖులు (Movie celebrities) పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోను కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కూటమికి సపోర్ట్ చేయగా…మరికొంతమంది నేరుగా ప్రచారంలోకి జనసేన , టిడిపి , బిజెపి నేతలకు ప్రచారం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా చాలామంది సినీ ప్రముఖులు వచ్చి కూటమి నేతలను అభినందించారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. నేడు అమరావతి వచ్చిన సుమన్… మంత్రి లోకేశ్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి, నారా లోకేశ్ ఘనవిజయాలు అందుకోవడం పట్ల సుమన్ అభినందనలు తెలిపారు. అలాగే గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను సైతం కలిశారు. కల్తీ మద్యం కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సుమన్ కోరారు. తన చాంబర్ కు వచ్చిన సుమన్ ను మంత్రి కొల్లు రవీంద్ర ఘనంగా సత్కరించారు.

Read Also : Bhatti Vikramarka : త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం: భట్టి

  Last Updated: 19 Jul 2024, 08:09 PM IST