Site icon HashtagU Telugu

Shivaji : పొలిటికల్ ఎంట్రీ ఫై శివాజీ క్లారిటీ..ఒకవేళ అదే జరిగితే అందరి దూల తీర్చేస్తాను

Shivaji Politca

Shivaji Politca

పొలిటికల్ ఎంట్రీ ఫై నటుడు శివాజీ (Shivaji) క్లారిటీ ఇచ్చారు..నాకు రాజకీయాల కన్నా యాక్టింగ్ కెరియర్ అంటేనే ఇంట్రెస్ట్ అని, ఒకవేళ ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం అది రేపు పొద్దున వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే ప్రజా సమస్యల కోసం వారికి ఒక గొంతుకలా ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి అంటగట్టాలని చూస్తే కచ్చితంగా ఆ పార్టీలోకి వెళతా, అందరి దూల తీర్చేస్తాను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న శివాజీ..ఆ తర్వాత హీరోగా కూడా పలు సినిమాలు చేసి అలరించాడు. ఆ తర్వాత సినిమాలు చేయడం తగ్గించి..సమాజం ఫై దృష్టి సారించి ప్రజల కష్టాలపై , రాజకీయ పార్టీల తీరు ఫై స్పందిస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే బిగ్ బాస్ షో లో పాల్గొని యావత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శివాజీ ఇలా ఉంటారా అని అంత అనుకునేలా చేసాడు. ప్రస్తుతం సినిమాల ఫై ఫోకస్ చేసిన ఈయన..రీసెంట్ గా #90స్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకులందరినీ పలకరించాడు. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అయింది. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడంతో ఈ వెబ్ సిరీస్ మీద చూసిన వారందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ టీం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాకు రాజకీయాలకు సంబంధం లేదని , నాకు రాజకీయాల కన్నా యాక్టింగ్ కెరియర్ అంటేనే ఇంట్రెస్ట్ మా పిల్లలు కూడా అటు వైపే ఉండమన్నారు నేను యాక్టింగ్ తప్ప మరోటి చేయను, ఒకవేళ ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం అది రేపు పొద్దున వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే ప్రజా సమస్యల కోసం వారికి ఒక గొంతుకలా ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి అంటగట్టాలని చూస్తే కచ్చితంగా ఆ పార్టీలోకి వెళతా, అందరి దూల తీర్చేస్తాను కాబట్టి నా జోలికి రావద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నేను నిజాలు మాట్లాడతాను కాబట్టి అందరికీ ప్రాబ్లమే. సో అలాంటివాడు రాజకీయాలకు పనికిరాడు, నేను రాజకీయాల్లో పనికిరాను అని నాకు తెలుసు. కానీ ప్రజలు గొంతుకులా మాత్రమే ఉంటాను, నేను ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతాను అది గుర్తించండి. ఒకవేళ మీరు గుర్తించలేకపోయినా నాకు వచ్చే సమస్య ఏమీ లేదు. మీరు గుర్తించకపోయినా శివాజీ -శివన్న ప్రజల గొంతుక ఆ గొంతుక నేను చనిపోయే వరకు మూగబోదు, నేను జనం కోసమే ఉన్నాను అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

Read Also : BJP : బిజెపి వలలో పడ్డ ప్రతిపక్షాలు