Minister Roja : ఐరెన్ లెగ్ కాదు..గోల్డెన్ లేడీ

మంత్రి రోజాకు ఒక‌ప్పుడు ఐరెన్ లెగ్ గా టీడీపీ ముద్ర వేసింది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాద‌ని రోజాపై సెంటిమెంట్ ను పులిమారు. అంతేకాదు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణించిన‌ప్పుడు ఆమె లెగ్ మ‌హిమ అంటూ టీడీపీలోని కొంద‌రు మాట్లాడిన సంద‌ర్భం లేక‌పోలేదు.

  • Written By:
  • Publish Date - April 12, 2022 / 02:25 PM IST

మంత్రి రోజాకు ఒక‌ప్పుడు ఐరెన్ లెగ్ గా టీడీపీ ముద్ర వేసింది. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాద‌ని రోజాపై సెంటిమెంట్ ను పులిమారు. అంతేకాదు, రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణించిన‌ప్పుడు ఆమె లెగ్ మ‌హిమ అంటూ టీడీపీలోని కొంద‌రు మాట్లాడిన సంద‌ర్భం లేక‌పోలేదు. సినీ రంగం నుంచి 1999లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం రోజా చేశారు. ఆ త‌రువాత జ‌రిగిన 2004 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయింది. ఆమె పార్టీలో చేరిన‌ప్ప‌టి నుంచి టీడీపీకి క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని చిత్తూరు లీడ‌ర్ల సెంటిమెంట్ ను లేపారు. 2009 ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ సంద‌ర్భంగా ఐరెన్ లెగ్ మ‌హిమ అంటూ చాలా మంది ఆ పార్టీ లీడ‌ర్లు ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో మాట్లాడుకునే వాళ్లు. ప్ర‌త్యేకించి గాలి ముద్దు కృష్ణ‌మ‌నాయుడు వ‌ర్గం ఆమె గురించి ప‌లు ర‌కాలుగా మాట్లాడేది. అప్ప‌టికే విసుగెత్తిపోయిన రోజా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో భాగంగా 2009 ఎన్నిక‌ల త‌రువాత రాజ‌శేఖ‌ర్ రెడ్డి గూటికి చేరారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కొన్ని నెల‌ల‌కే రాజ‌శేఖ‌ర్ రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మృతి త‌రువాత ఐరెన్ లెగ్ ముద్ర రోజాపై గ‌ట్టిగా ప‌డింది. త‌ద‌నంత‌రం జ‌గ‌న్ జైలుకు వెళ్లాడు. వైసీపీలోని కొంద‌రు లీడ‌ర్లు కూడా ఆమె లెగ్ గురించి మాట్లాడుకునే ప‌రిస్థితికి ఆ సెంటిమెంట్ వెళ్లింది. ఆ స‌మ‌యంలో ఆమె ప‌డిన బాధ వ‌ర్ణ‌నాతీతం. సినీ, రాజ‌కీయ రంగంలో క‌నిపిస్తోన్న శూన్యం ఆవ‌హించిన రోజుల్లో రోజా కొంత కాలం ఏడుస్తూ గ‌డిపారు. ఆ టైంలోనే రోజాపై అనేక గాసిప్స్ ను కూడా టీడీపీ లేపింది. కుటుంబంలోనూ కొన్ని ర‌కాల స‌మ‌స్య‌లు ఆమెను వెంటాడాయి. కానీ, ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా ధైర్యంగా అవ‌మానాల‌ను భ‌రించారు. 2014 ఎన్నిక‌ల్లో తొలిసారిగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో మ‌రోసారి ఐర‌న్ లెగ్ సెంటిమెంట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. కానీ, అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీపై ఆమె పోరాడిన తీరు జ‌గ‌న్ కు న‌చ్చింది. ఆమెను అసెంబ్లీ నుంచి బ‌హిష్క‌రించిన‌ప్ప‌టికీ టీడీపీపై అసెంబ్లీ బ‌య‌ట పోరాటం ఆప‌లేదు. దీంతో జ‌గ‌న్ గుడ్ లుక్స్ లో ఆనాడు రోజా ప‌డ్డారు.తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రోజా, రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా చెడ్డ శకునంగా భావించారు. దాదాపు రెండు దశాబ్దాలు రాజకీయ పోరాటం చేసిన త‌రువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో గౌరవనీయమైన మంత్రి పదవిని సంపాదించారు. ఆమెకు టూరిజం, కల్చర్ మరియు యూత్ అడ్వాన్స్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ఇచ్చారు. కేబినెట్ మంత్రిగా ప్ర‌క‌టించిన త‌రువాత ఆమె ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. “జగన్ మోహన్ రెడ్డి నన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అసెంబ్లీలో ఉండటం టీడీపీకి ఇష్టం లేదని, జగన్ రెండు సార్లు ఎమ్మెల్యేని చేసి, నేడు నన్ను కూడా మంత్రిని చేశారన్నారు. ఇందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ప్రభుత్వానికి, నా కుటుంబానికి పేరు తెచ్చేలా కృషి చేస్తాను.“ అంటూ రోజా స్పందించారు.

రోజా 1991లో తెలుగు చిత్రం ప్రేమ తపస్సుతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆమె చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, మమ్ముటీ తో పాటు అనేక ఇతర దక్షిణ భారత సూపర్ స్టార్‌లతో నటించారు. అయినప్పటికీ, ఆమె 2014 వరకు రాజ‌కీయంగా బాగా వెనుక‌బ‌డ్డారు. ఫ‌లితంగా రాజకీయ వర్గాల్లో ‘ఐరన్ లెగ్స‌ అనే ట్యాగ్ ప‌డింది. ఆమె రాజకీయ జీవితాన్ని , ఆమె ఉన్న టీడీపీని ప్రభావితం చేసిన దురదృష్టకర సంఘటనల పరంపర ఆమెకు ఐరెన్ లెగ్ ట్యాగ్ వ‌చ్చేలా చేశాయి.మొదట 1998లో తెలుగుదేశం పార్టీతో జతకట్టిన రోజా పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆమెకు టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. ఆమె 2004లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమెతో పాటు పార్టీ కూడా ఓడిపోయింది. అప్పటి నుండి ఆమెపై దురదృష్టంత వంతురాలి ముద్ర‌ప‌డింది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఆమె చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వరుస వైఫల్యాల కార‌ణండా ఐరెన్ ముద్ర‌ను మ‌రింత పెరిగింది. రోజా 2009లో జగన్ మోహన్ రెడ్డి కొత్తగా స్థాపించిన YSRCP పార్టీలో చేరారు. జగన్ అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. ఈ సంఘటన ఆమె ‘ఐరన్ లెగ్’ అనే సెంటిమెంట్‌ను శాశ్వతం చేసింది.
ఆమె వరుస ఓటములకు ముగింపు పలికి 2014, 2019లో నగరి నుండి శాసనసభ్యురాలిగా రెండు పర్యాయాలు గెలుపొందారు. శాసనసభ్యురాలిగా ఉండటమే కాకుండా, రోజా తెలుగు షోలలో అప్పుడప్పుడు సహాయ పాత్రలలో కనిపిస్తూనే ఉన్నారు. సీన్ క‌ట్ చేస్తే ప్ర‌స్తుతం మంత్రి అయ్యారు. జ‌బ‌ర్ధ‌స్త్ షోకు గుడ్ బై చెప్పారు. యుద్ధంలో గెలిచానంటూ ఉద్వేగం ఆపులేని స్థితిలో ఆమె ప్ర‌మాణ‌స్వీకారం సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ చేతిని ముద్దాడి కృత‌జ్ఞ‌త‌ను తెలుపుకుంది. మొత్తం మీద ద‌శాబ్దాలుగా ఐరెన్ లెగ్ ముద్ర వేసిన ప్ర‌త్య‌ర్థుల‌కు ప్ర‌స్తుతం రోజా గోల్డెన్ లేడీగా క‌నిపిస్తున్నారు. ఆమె మ‌నోధైర్యం శ‌భాష్ అనిపించేలా ఉంది.