Actor Ali : సైలెంట్ మోడ్‌లో అలీ.. వైసీపీ మొండిచెయ్యి !

Actor Ali : కమెడియన్ అలీ ప్రస్తుతం పేరుకు వైఎస్సార్ సీపీలో ఉన్నా.. సైలెంట్ మోడ్‌లో ఉన్నారు.

  • Written By:
  • Updated On - April 8, 2024 / 08:06 AM IST

Actor Ali : కమెడియన్ అలీ ప్రస్తుతం పేరుకు వైఎస్సార్ సీపీలో ఉన్నా.. సైలెంట్ మోడ్‌లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన ఆయన ఈసారి మాత్రం అప్పటి స్థాయిలో యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఎవరైనా సరే ఎదుగుదలను కోరుకునే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారు. అలీ కూడా అలాగే ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కావాలని మొదటి నుంచి భావిస్తున్నారు. ఇవి రెండూ వీలు కాకపోతే తనను వైఎస్ జగన్ రాజ్యసభకు పంపుతారనే ఆశాభావంతో ఆయన ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆయనకు ఏ ఒక్క అవకాశం కూడా వైసీపీలో దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీకి సంబంధించి  ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18న నోటిఫికేషన్  రిలీజ్ కానుంది.  ఆ తర్వాత ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది. ఆలోగా వైఎస్సార్ సీపీ అధినాయకత్వం నుంచి ఏదైనా హామీ లభించకుంటే.. అలీ(Actor Ali) తన భవితవ్యంపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తదుపరిగా అలీ అడుగులు ఎటు వైపు ?  ఆయన తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి ఈ ఎన్నికల్లో తనకు రాజమండ్రి రూరల్ కానీ అర్బన్ కానీ ఏదో ఒక అసెంబ్లీ టికెట్ ఇస్తారని అలీ అనుకున్నారు. కానీ చివరికు ఆ సీట్లలో రాజమండ్రి అర్బన్ టికెట్‌ను ఎంపీ మార్గాని భరత్‌కు.. రాజమండ్రి రూరల్ టికెట్‌ను మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణకు జగన్ కేటాయించారు. దాంతో అలీకి గుంటూరు నుంచి ఎంపీగా కానీ కర్నూల్ ఎంపీగా కానీ ఇస్తారని అనుకున్నారు. తీరా చూస్తే ఆ టికెట్లు కూడా వేరే వాళ్లకు వెళ్లిపోయాయి. మొత్తం 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్ల భర్తీలో అలీ పేరు ఎక్కడా లేదు.  దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన అలీ సైలెంట్ అయిపోయారట.

Also Read :Pregnancy Care : తల్లి చేసే ఈ ఒక్క అలవాటు బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తుంది..!

2000 సంవత్సరం నుంచే రాజకీయాల్లో అలీకి ఇదే విధమైన భంగపాటు ఎదురవుతోంది. తొలుత ఆయన టీడీపీలో చేరారు. నాడు చంద్రబాబు.. నేడు జగన్.. ఎవరు కూడా అలీ కోరికను తీర్చలేకపోయారు. ఇక మిగిలింది ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులే. ఒకవేళ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీ ఇస్తామనే హామీ ఇస్తే దాని ఆధారంగా అలీ తన యాక్టివిటీని మళ్లీ మొదలుపెట్టే ఛాన్స్ ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. తన రాజకీయ భవితవ్యంపై నెమ్మదిగా, ఆచితూచి నిర్ణయం తీసుకునే దిశలో అలీ ఉన్నారని తెలుస్తోంది. అలీ ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో ఎలక్ట్రానికి మీడియా అడ్వైజర్ గా ఉన్నారు. ఈ పోస్టులో ఆయన 2022 అక్టోబరులో నియమితులయ్యారు.

Also Read : Alcohol : భారతదేశంలో మహిళలు ఎక్కువగా మద్యం సేవించే ప్రదేశం ఇదే.!