AP Political Satires: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీఎం జగన్ పై విమర్శలు సందిస్తుంటే జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే తాజాగా సీఎం జగన్ నియోజక వర్గాల ఇంచార్జీలపై ప్రత్యేక ఫోకస్ పెడుతూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే అంశంపై టీడీపీ సెటైరికల్ కామెంట్స్ కు పాల్పడుతుంది.
వైసీపీ పార్టీలో గ్రాఫ్ బాగోలేని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కదారి పట్టించేందుకు వైసీపీ సిద్ధమైంది. వైసీపీ 11 నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమించింది. మరోవైపు నియోజకవర్గ ఇన్ చార్జిల మార్పుపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే కాదు… ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను మార్చినా వైసీపీ గెలుపు అసాధ్యమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వాదించారు. వైసీపీ అధికారంలో ఇంకా మూడు నెలలు మాత్రమే ఉందన్నారు.
ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు… ఇప్పుడు మీరు ఎంత మందిని మార్చినా ఫలితం శూన్యం. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను ఇలాగే మార్చేస్తే.. పులివెందులతో కలిపి మొత్తం 151 మందిని మార్చాల్సి ఉంటుందన్నారు.
Also Read: Chief Security Officer : సీఎం రేవంత్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా గుమ్మి చక్రవర్తి