సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి, కూలీలతో వెళ్తున్న ఆటో మంటల్లో కాలి పోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది కూలీలే అక్కడికక్కడే సజీవ దహనమైయ్యారు. మృతులు గుడ్డంపల్లికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటన తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో చోటు చేసుకుంది. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని… మృతుల కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. హైటెన్సన్ విద్యుత్ తీగలు తెగి బస్సుపై పడడంతో ప్రమాదo జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశరాఉ. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.