Accident : హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 12:05 PM IST

రోడ్డు ఫై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మృతువు ఏ రూపంలో వస్తుంది..ఎటు నుండి వస్తుంది అర్ధం కానీ పరిస్థితి. మనం జాగ్రత్తగా వెళ్లిన…అవతలి వ్యక్తి ఎలా వస్తాడో అర్ధం కావడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్య లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై
అలాంటి ఘోర రోడ్డు ప్రమాదమే జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు మండలం రామ్నుంతల శివారులోని హైవేపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జువగా మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు అంటున్నారు.

Read Also : జగన్ ప్రమాణ స్వీకారం కోసం వైజాగ్ లో భారీగా హోటల్ రూమ్స్ బుకింగ్ ..