Site icon HashtagU Telugu

YS Jagan : జ‌గ‌న్ ప్ర‌య‌త్నం పాక్షిక ఫ‌ల‌ప్ర‌దం

ACB toll

ACB toll

ఏపీ సీఎం జ‌గ‌న్ అవినీతి ర‌హిత పాల‌న దిశ‌గా కొన్ని సంస్క‌ర‌ణ‌లు చేశారు. వాటిలో భాగంగా రెండేళ్ల క్రితం అవినీతిపై ఫిర్యాదు చేయ‌డానికి 14400 అనే టోల్ ఫ్రీ నెంబ‌ర్ ను ప్ర‌క‌టించారు. ఇప్పటి వ‌ర‌కు ఆ నెంబ‌ర్ కు 8,268 ఫిర్యాదు అందాయ‌ని ఏపీ అవినీతి నిరోధక శాఖ వెల్ల‌డించింది. నవంబర్ 25, 2019న టోల్ ఫ్రీ నంబర్ 14400 ప్రారంభించినప్పటి నుండి వ‌చ్చిన ఫిర్యాదుల్లో దాదాపుగా ప‌రిష్కారం అయ్యాయ‌ని ఏసీబీ చెబుతోంది. వ‌చ్చిన 8,268 ఫిర్యాదుల్లో 8,213 పరిష్కరించబడ్డాయి. మొత్తం 149 ఫిర్యాదులకు సంబంధించినవి ఏసీబీకి, ఇతర విభాగాలకు సంబంధించిన 749 ఫిర్యాదులు ఏసీబీ ద్వారా ఆయా విభాగాల‌కు వెళ్లాయి. ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ 8 మందిపై కేసులు నమోదు చేసింది, 12 ఫిర్యాదుల‌పై సాధారణ విచారణలను చేపట్టింది. 13 ఫిర్యాదుల‌కు సంబంధించి ప‌రిశీలించిన మీద‌ట విచార‌ణ కొన‌సాగుతోంది. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆకస్మిక తనిఖీలు ను ఏసీబీ చేసింది. మొబైల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై 3 సాధారణ విచారణలు చేపట్టారు. ఒక ట్రాప్ కేసు నమోదు చేయబడింది.

Exit mobile version