Chandrababu Arrest Case: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీ పిటిషన్ పై ఉత్కంఠకు తెరపడింది. ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్‌ను తిరస్కరించారు. చంద్రబాబును ఉంచిన రాజమండ్రి జైలులో ముప్పుపొంచి ఉందన్న న్యాయవాదుల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. హౌస్ కస్టడీకి అనుమతివ్వాలని చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు కాలేదు. దీంతో హౌస్ కస్టడీకి అనుమతి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. చంద్రబాబు తరుఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా , సీఐడీ తరుపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అంతకుముందు రేపు ఉదయమే తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. కానీ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించారు. దీంతో టీడీపీ శ్రేణులకు నిరాశ తప్పలేదు.
Also Read: Eelection in April : KCR కు అంతుబట్టని BJP స్కెచ్!