Site icon HashtagU Telugu

Chandrababu CBI Custody : చంద్రబాబు ను సీఐడీ కస్టడీకి అప్పజెబుతూ..ఏసీబీ కోర్టు పెట్టిన కండిషన్స్

Acb Court Conditions To Cid

Acb Court Conditions To Cid

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu )కు ఊహించని షాకులు ఎదురవుతున్నాయి. ఓ పక్క కేసులు..మరోపక్క విచారణ వాయిదాలు..బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు..మరోపక్క ఆయన కుమారుడు నారా లోకేష్ ను సైతం అరెస్ట్ చేస్తారనే వార్తలు..ఇలా వరుసపెట్టి షాకులు ఎదురువుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగానే శుక్రవారం ఏసీబీ కోర్ట్ (ACB Court)..రెండు రోజులు సీఐడీ కస్టడీ (CBI Custody)కి అప్పజెపుతూ ఇచ్చిన తీర్పు టీడీపీ శ్రేణులను మరింత షాక్ కు గురి చేసింది. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు ను సీఐడీ ఎలా విచారణ చేస్తుందో..? ఏమైనా చేయి చేసుకుంటుందా..? ఏ విధంగా విచారణ చేస్తారు..? ఇలా అనేక ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి.

ఇక చంద్రబాబు ను సీఐడీ కస్టడీకి అప్పజెబుతూ..ఏసీబీ కోర్టు పలు కండిషన్స్ ..

చంద్రబాబును సీఐడీ 5 రోజుల కస్టడీకి కోరింది. కానీ ఏసీబీ కోర్టు 2 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. చంద్రబాబును జైలులోనే విచారించేందుకు అనుమతిస్తున్నట్లు కోర్టు తెలిపింది. రేపు, ఎల్లుండి చంద్రబాబును విచారించేందుకు కోర్టు అనుతులు ఇచ్చింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే విచారణ నిర్వహించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. విచరణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లను అనుమతించింది.

అయితే.. విచారణ చేసే సీఐడీ అధికారుల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణకు సంబంధించి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు రావొద్దని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మీడియా కు విచారణ కు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదని తెలిపింది. చంద్రబాబు ఆరోగ్య రిత్యా, వయసు రిత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని స్పష్టం చేసింది.

Read Also : Jagan Reverse Attack : చంద్ర‌బాబుపై రివ‌ర్స్ స్కెచ్ వేసిన జ‌గ‌న్