Site icon HashtagU Telugu

Skill Development Case : చంద్రబాబు కు 14 రోజుల రిమాండ్

ACB Court Announce 14 days judicial remand for Chandrababu

ACB Court Announce 14 days judicial remand for Chandrababu

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development Case) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (చంద్రబాబు ) కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్ట్. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో శనివారం అదుపులోకి తీసుకున్న CID ..నేడు ఏసీబీ కోర్ట్ లో హాజరుపరిచారు. ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి టీమ్ వాదనలు వినిపించగా.., చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఉదయం మొదలైన వాదనలు..మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ వాదనలు మొదలుపెట్టారు. 2:45 నిమిషాలకు వాదనలు ముగిసాయి. వాదనలు ముగిసిన తర్వాత చంద్రబాబు కు బెయిల్ వస్తుందని అంత భావించారు కానీ..సీఐడీ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది.

Read Also : TDP Worker on Cell Tower : చంద్రబాబు కు బెయిల్ ..ఓ ప్రాణాన్ని కాపాడిన పోలీసులు

ఏసీబీ కోర్టు చంద్రబాబుకు  2 వారాల రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. మరికాసేపట్లో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు లాయర్లు మరికాసేపట్లో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలావుండగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. రూ.271 కోట్ల స్కామ్‌ జరిగిందని, అందులో చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొంది. ఏసీబీ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యారు.

Read Also : Lawyer Sidharth Luthra : ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరుపున సిద్ధార్థ్ లూత్రా చేసిన వాదనలు ఇవే..