Site icon HashtagU Telugu

Chandrababu : చంద్ర‌బాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌ను రేపటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

ACB Court

Chandrababu Naidu Meets his Family at SIT Office

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు బెయిల్, క‌స్ట‌డీ పిటిష‌న్ విచార‌ణ‌ను ఏసీబీ కోర్టు రేప‌టికి వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ పిటిషన్, సిఐడి కస్టడీ పిటిషన్‌లను ఏసీబీ కోర్టు ఈ రోజు విచారించింది. కేబినెట్ ఆమోదం పొందిన ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు పాత్ర లేదని చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద కుమార్ దూబే వాదనలు వినిపించారు.ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్ర‌బాబుకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు కావచ్చని ఏఏజీ సుధాక‌ర్ రెడ్డి వాద‌న‌లు వినిపించారు. చంద్ర‌బాబు కుంభకోణంలో ప్రధాన పాత్ర ఉందని ఈ నేప‌థ్యంలో బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఏఏజీ వాద‌న‌ల‌కు ఏసీబీ కోర్టు న్యాయ‌మూర్తి అభ్యంత‌రం తెలిపారు. చెప్పిందే ప‌దే ప‌దే చెప్తున్నారంటూ అస‌హ‌నం వ్యక్తం చేశారు. ఆధారాలు ఉంటూ కోర్టుకి స‌మ‌ర్పింల‌ని సీఐడీ న్యాయ‌వాదుల‌కు జ‌డ్డి తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు కూడా దీనిపై వాద‌న‌లు కొన‌సాగే అవ‌కాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.