Site icon HashtagU Telugu

ACB Court : చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్ట్

TDP

AP CID files fresh case against Chandrababu

సీఐడీ అధికారుల కాల్ డేటా (CID Call Data ) రికార్డులను భద్రపరచాలంటూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసి చంద్రబాబు కు షాక్ ఇచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో చంద్రబాబు (Chandrababu) అరెస్టు సమయంలో అక్కడున్న సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డు కావాలని కోరుతూ చంద్రబాబు తరుపు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టు (ACB Court) తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీఐడీ తరఫున వివేకానంద, చంద్రబాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌లు తమ తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించి పిటీషన్‌ను కొట్టేసింది.

We’re now on WhatsApp. Click to Join.

కేసులో చంద్రబాబు అరెస్టైన డే 1 రోజునే.. సీఐడీ అధికారుల కాల్ డేటా భద్రపరచాలంటూ ఆయన తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు.. పలువురిని సంప్రదిస్తుంటారని సీఐడీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో అధికారుల కాల్‌డేటా ఇవ్వడం గోప్యతకు భంగమని, ఆ ప్రభావం విచారణపై పడుతుందని వాదించారు. ఈ కేసులో ఈనెల 27న వాదనలు పూర్తికాగా.. ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈరోజు తీర్పు వెల్లడించింది.

Read Also : CBN Is Back : జైలు నుండి బయటకు వచ్చాక మీడియా తో చంద్రబాబు ఏమన్నారంటే..