Site icon HashtagU Telugu

ABP – CVoter Opinion Poll : ఏపీలో కూటమి భారీ విజయం సాదించబోతుంది

Abp Poll

Abp Poll

దేశం మొత్తం ఎన్నికల నగారా మోగిన అందరి చూపు..అందరు మాట్లాడుకునేది మాత్రం ఏపీ ఎన్నికల గురించే. 14 ఏళ్లు సీఎం గా ప్రజలకు సేవ చేసిన చంద్రబాబు ను గెలిపిస్తారా..? సంక్షేమం పేరుతో ఐదేళ్లుగా పాలించిన జగన్ ను గెలిపిస్తారా..? ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికల పోలింగ్ కు నెలరోజులు కూడా సమయం లేకపోయేసరికి అనేక సంస్థలు ప్రజల ఏమనుకుంటున్నారు..? ఏ పార్టీ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావిస్తున్నారు..? రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలన ఎలా ఉంది..? అంతకు ముందు చంద్రబాబు పాలన ఎలా ఉంది..? కూటమి పార్టీల ఫై మీ అభిప్రాయం..? కూటమి విజయం సాదించబోతుందా..? ఇలా అనేక ప్రశ్నలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. వారి అభిప్రాయాలను సేకరించి Opinion పోల్ తెలియజేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఏబీపీ – సీఓటర్ ఒపీనియన్ సంస్థలు ప్రజల అభిప్రాయాలు సేకరించి ..వారు ఏమనుకుంటున్నారో తెలియజేసింది. వీరు తెలిపిన సర్వేలో కూటమి పార్టీ భారీ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పింది. ముందుగా లోక్ సభ స్థానాలకు సంబంధించి 25 స్థానాలకు గాను కూటమి పార్టీ దాదాపు 20 స్థానాల్లో విజయం సాదించబోతున్నట్లు తెలిపారు. బీజేపీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తూండగా ఐదు చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని , టీడీపీ 13 , జనసేన 02 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇక వైసీపీ పార్టీ కేవలం 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో మెజార్టీ ఓటర్లు కూటమికే మద్దతు తెలుపుతున్నారని పేర్కొంది.

Read Also : Hyderabad: షీటీమ్స్ ఆపరేషన్.. మహిళలను వేధిస్తున్న 122 మంది పట్టివేత