ఏపీలో మహిళలపై దాడులు ఆగడం లేదు. ఒంటరి గా కనిపిస్తే అత్యాచారాలు చేస్తున్న వారు కొందరు..ప్రేమ పేరుతో వేధిస్తున్న వారు మరికొందరు..దీంతో ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే వణికిపోతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కామాంధులు , ప్రేమ పేరుతో వేధించేవారు మారడం లేదు. రోజు రోజుకు వీరి విధింపులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఓ పక్క ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తే కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న..ఆ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా వైజాగ్ లో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని యువతిపై ఐరన్ రాడ్డుతో దాడి చేసిన పెడగంట్యాడ మండలం బీసీరోడ్‌లో చోటుచేసుకుంది.
ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యువతి నుంచి స్టేట్ మెంట్ తీసుకొని, కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు. స్థానిక యువకుడు నీరజ్ శర్మ తనను ప్రేమించాలని బీసీరోడ్‌కు చెందిన యువతిని కొంతకాలంగా వేధిస్తున్నారు. యువతి నిరాకరించినా నీరజ్ వేధింపులు మరీ ఎక్కువ కావడంతో ప్రేమించడం కుదరదని చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన నీరజ్ శర్మ.. ఐరన్ రాడ్డు తీసుకుని డైరెక్ట్‌గా యువతి ఇంటికే వెళ్లి దాడి చేశారు. అడ్డుకోబోయిన యువతి కుటుంబ సభ్యులపైనా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడికి కఠిన శిక్ష వేయాలని వారంతా కోరుతున్నారు.
Read Also : Team India World Record: టీమిండియా పేరిట ప్రపంచ రికార్డు.. ఏంటంటే..?