Brutal Murder: గుంటూరులో దారుణం.. వైద్య విద్యార్థిని దారుణ హత్య

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Son Killed Father

Crime Scene

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడే సర్జికల్ బ్లేడుతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మృతిచెందింది. జిల్లాలోని పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో తపస్వి అనే వైద్య విద్యార్థినిని జ్ఞానేశ్వర్‌ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. గతకొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్న తపస్వి,జ్ఞానేశ్వర్ మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జ్ఞానేశ్వర్ ఆమెపై సర్జికల్ బ్లేడ్‌తో దాడి చేయగా.. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

నిందితుడు జ్ఞానేశ్వర్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వైద్య విద్యార్థితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇది ప్రేమగా మారడంతో వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంతలో వారి మధ్య మనస్పర్థలు చెలరేగడంతో అతన్ని తపస్వి దూరం పెట్టింది. ఈ క్రమంలో తక్కెళ్లపాడులోని ఓ దంత వైద్య కాలేజీలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసింది.

సోమవారం తపస్వి స్నేహితురాలు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేయగా ఆ సమయంలో జ్ఞానేశ్వర్.. తపస్విపై సర్జికల్ బ్లేడుతో ఒక్కసారిగా దాడి చేశాడు. అనంతరం జ్ఞానేశ్వర్ కూడా దాడి తర్వాత చేయి కోసుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  Last Updated: 06 Dec 2022, 05:55 AM IST