Site icon HashtagU Telugu

YCP Activist Murdered: న‌డిరోడ్డుపై వైసీపీ కార్య‌కర్త దారుణ హ‌త్య‌.. రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు..!

YCP Activist Murdered

YCP Activist Murdered

YCP Activist Murdered: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో రోజుకోపూట హ‌త్య ఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో పార్టీల పోరు తారాస్థాయికి చేరుతోంది. తాజాగా వినుకొండలో దారుణ ఘటన జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్‌పై (YCP Activist Murdered) టీడీపీ కార్యకర్త జిలానీ కత్తితో దాడి చేసి చంపేశాడు. రషీద్ రెండు చేతులు నరికి, మెడపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు జిలానీని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఈ హ‌త్య‌పై రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై సందేహ‌లు నెల‌కొంటున్నాయి. అంద‌రూ చూస్తుండగానే ఒక మ‌నిషిని ఇంత దారుణంగా ఎలా చంప‌గ‌లిగాడు అనే ప్ర‌శ్న‌లు తలెతుత్తున్నాయి. ఇక‌నైనా రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మంత్రి అనిత‌కు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌కు, మంత్రి నారా లోకేష్‌కు ఉంద‌ని వైసీపీ ట్వీట్ చేసింది.

Also Read: Virat Kohli: కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే డేంజరే.. చుక్కలు చూపిస్తాడన్న ఆసీస్ మాజీ కెప్టెన్

రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు

పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త హత్యపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ రాష్ట్రపతి మేడం. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రజలను కాపాడండి. అలాగే మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని కోరుతున్నాం’’ అని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.

వ్యక్తిగత కక్షలతోనే హత్య: ఎస్పీ

పల్నాడు జిల్లా వినుకొండ చెక్‌పోస్టు సెంటర్‌లో జరిగిన రషీద్‌ అనే యువకుడి హత్యపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ పార్టీలకు ప్రమేయం లేదన్నారు. నిందితుడు జిలానీని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. దీంతో వినుకొండలో 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.