Site icon HashtagU Telugu

Finance : రేపు ఏపి శాసనసభలో ఆర్థిక శాఖ పై శ్వేతప్రతం విడుదల

A white paper on the finance department will be released in the AP Legislative Assembly tomorrow

A white paper on the finance department will be released in the AP Legislative Assembly tomorrow

Finance Department: ఆర్థిక శాఖ పై రేపు(శుక్రవారం) ఏపి శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రం(white paper) విడుదల చేయనుంది. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్‌ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పెండింగ్‌ బిల్లుల వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. పెండింగ్ బిల్లుల్లో రూ.93 వేల కోట్లు సీఎఫ్ఎంఎస్‌లోకి అప్ లోడ్ చేయలేదని ప్రభుత్వం పేర్కొంది. రూ.48 వేల కోట్ల మేర బిల్లులు అప్ లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

చెల్లించాల్సిన బిల్లుల్లో 93 వేల కోట్ల రూపాయల విలువైన బిల్లులను ఇప్పటివరకు ఆర్థిక శాఖ సిఎఫ్‌ఎంఎస్‌లోకి అప్‌లోడ్‌ కూడా చేయలేదని సమాచారం. మరో 48 వేల కోట్ల రూపాయల వరకు బిల్లులు అప్‌లోడ్‌ జరిగినప్పటికీ, చెల్లింపులు జరగలేదని ఆర్థికశాఖ తాజా అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో ఎక్కువ భాగం నీటి పారుదల శాఖకు చెందినవే ఉన్నట్లు సమాచారం. పోలవరంతోపాటు ఆనేక పథకాలకు 19,324 కోట్లు బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో పలువురు కాంట్రాక్టర్లు పనులు ఆపివేసి వెనక్కు వెళ్లిపోయారు.

కాగా, నీటి పారుదల శాఖ(Irrigation Department), పోలవరం బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. వివిధ ప్రాజెక్టులకు చెందిన రూ.19,324 కోట్ల మేర బకాయిలను గుర్తించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు పేర్కొంది. మున్సిపల్ శాఖలో రూ.7,700 కోట్లకు పైగా బకాయిలను గుర్తించినట్లు పేర్కొంది. ఆర్థిక శాఖ నుండి రూ.19,549 కోట్ల బల్లుల పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది.

Read Also: Telangana Budget 2024 – 25 : క్లారిటీ లేని బడ్జెట్ – కేసీఆర్ ఎద్దేవా