TTD : చేతిలో కర్ర ఉంటె పులి దాడి చేయదా..? టీటీడీ నిర్ణయం ఎంత వరకు కరెక్ట్..?

భక్తులను కాపాడాల్సిన బాధ్యత టిటిడి (TTD) ది. అలాంటప్పుడు వారు కాపాడాల్సింది పోయి.. ఆ టైం కు రావాలి..

  • Written By:
  • Updated On - August 16, 2023 / 02:54 PM IST

TTD New Rules for Devotes: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల (Tirumala). కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. అందుకే ఆ కలియుగ శ్రీనివాసున్ని (Tirumala Sri Venkateswara Swamy) చూసేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు. ఒక తెలుగు రాష్ట్రాల నుండే కాదు వివిధ రాష్ట్రాల నుండి.. దేశాల నుండి కూడా ప్రతి రోజు భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. అయితే ఇప్పుడు తిరుమల వెళ్లే భక్తులను క్రూర మృగాలు (Wild Animals) భయపెట్టిస్తున్నాయి. ముఖ్యంగా కాలినడకన (Tirumala Steps) తిరుమల కొండకు వెళ్లే భక్తుల ఫై చిరుత పులులు , ఎలుగుబంట్లు దాడికి దిగుతున్నాయి. ఈ మధ్య మరి ఎక్కువయ్యాయి.

మొన్నటికి మొన్న తిరుమల నడకమార్గంలో చిరుత దాడి (Cheetah Attacked) లో లక్షిత (Lakshita) అనే చిన్నారి మృతి చెందింది. నెల్లూరు జిల్లాకు చెందిన వాసులు మెట్ల మార్గాన కొండపైకి వెళ్తున్న క్రమంలో..చిన్నారి లక్షిత ను చిరుత పులి లాకెళ్లింది. తెల్లారి ఉదయం లక్షిత మృతదేహం లభ్యమైంది. చిన్నారి మృతి తో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. దేవుని చూసేందుకు వస్తే.. తమ బిడ్డనే తీసుకెళ్లాడని ఆ తల్లి రోదిస్తుంటే అందర్నీ కంటతడికి గురి చేసింది. అంతకు ముందు కూడా ఓ బాలుడ్ని అలాగే లాకెళ్ళగా.. ఆ బాబు క్షేమంగా బయటపడ్డాడు. ఇలా తరుచు క్రూర మృగాలా దాడులు ఎక్కువ అవుతుండడం తో కాలినడకన వెళ్లే భక్తులు భయపడుతున్నారు.

ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈనిర్ణయం (TTD New Rules) ఫై భక్తులతో పాటు సామాన్య ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి నుండి ఊతకర్ర కాపాడుతుందా అని ప్రశ్నిస్తున్నారు. పులిని చూస్తేనే మనకు భయం వేస్తుంది..అలాంటిది పులి దగ్గరికి వచ్చిన సమయంలో కర్ర తో దానిని ఆపగలమా..? ఇదేమైనా సినేమానా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అదనపు సెక్యూర్టీ పెంచడం..పులులను దూరంగా తరలించడం..మెట్ల మార్గాన ఇనుప సువ్వలు వంటివి నిర్మించి పులులను కట్టడి చేయాలి కానీ కర్ర ఇచ్చి నడవండి అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

అలాగే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే మాత్రమే 15 ఏళ్లలోపు పిల్లలను అనుమతి ఇస్తామని చెప్పడం , మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్నపిల్లలను అనుమతించేది లేదని చెప్పడం , రాత్రి పది గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుందని నిర్ణయాల ఫై కూడా భక్తులు మండిపడుతున్నారు. ఎంతో దూరం నుండి శ్రీవారి దర్శనం చేసుకుందామని వస్తే భక్తులపై ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఏంటి అని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులను కాపాడాల్సిన బాధ్యత టిటిడి (TTD) ది.. అలాంటప్పుడు వారు కాపాడాల్సింది పోయి.. ఆ టైం కు రావాలి.. ఈ టైంకు రావాలని కండీషనలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. టిటిడి (TTD), క్రూర మృగాల నుండి కాపాడలేక ఇలా చెత్త నిర్ణయాలు తీసుకుంటుందని భక్తులు ఫైర్ అవుతున్నారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు కాకుండా..మృగాలాను కట్టడి చేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read Also : Hyderabad: బావిలో బాలుడి మృతిదేహం లభ్యం