Site icon HashtagU Telugu

AP Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 దుర్మరణం!

Road Accident

Road Accident

రోడ్డు ప్రమాదాలపై (Road Accident) పోలీసులు, ఉన్నతాధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రమాదాలకు చెక్ పడటం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు ఏదో ఒకచోటా భారీ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఫలితంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగంతో కొన్ని, నిర్లక్ష్యంతో మరికొన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం. తాజాగా ఏపీలో (Andhra Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన 7 దుర్మరణం పాలయ్యారు.

తూర్పు గోదావరి (East Godavari ) జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో వంతెనపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన 8 మంది హైదరాబాద్‌లో వివాహానికి హాజరై తిరిగి స్వస్థలానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో హైవేపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Also Read: Governor Tamilisai: గర్భిణులు కచ్చితంగా రామాయణం చదవాలి: గవర్నర్ తమిళిసై!