Tragedy in AP : చలాకీ తనంతో సీఎం జగన్ దృష్టిని ఆకర్షించిన ఆ చిన్నారి ఇక లేదు…!!

ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి విన్నవారిందరిలో కంటకన్నీరు తెప్పిస్తోంది

  • Written By:
  • Updated On - September 2, 2022 / 10:03 AM IST

ఆంధ్రప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి విన్నవారిందరిలో కంటకన్నీరు తెప్పిస్తోంది. అసలు విషయం ఏంటంటే…సరిగ్గా నెల క్రితం ఓ చిన్నారి…ఏపీ సీఎం జగర్ పర్యటనలో చాలా చలాకీగా సందడి చేసింది. ఆ చిన్నారి నిన్న డెంగ్యూ జ్వరంతో మరణించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామారాజు జిల్లా చింతూరు మండలం కుయిగూరు గ్రామానికి చెందిన కారం సంధ్య 10 ఏళ్ల వయస్సుంటుంది. చింతూరులోని ఓ ప్రైవేటు స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. జూలై 27 సీఎం జగన్ చింతూరు మండలం కుయిగూరు పర్యటనకు వచ్చారు. అక్కడ ఎంతో చలాకీ సందడి చేస్తూ సీఎం దృష్టిని ఆకర్షించింది. దీంతో సీఎం జగన్ ఆ చిన్నారిని దగ్గరికి పిలుచుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాంటి బాలికకు ఇప్పుడే నిండునూరెళ్లు నిండాయని స్థానికులు కంటతడిపెడుతున్నారు. చిన్నారి తండ్రి కల్లేరు మాజీ సర్పంచి.

ఆయన కుటుంబం కొయిగూరులో నివాసం ఉంంటుంది. 4 రోజుల క్రితం ఏసుబాబుకు డెంగ్యూ సోకింది. దీంతో భద్రాచలంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. చిన్నారి సంధ్య తండ్రిని చూసుకుంటూ ఆయనతోనే ఉంది. ఏసుబాబుకు నయం కావడంతో సోమవారం ఇంటికి వెళ్లాడు. అదేరోజున చిన్నారి కూడా నలతగా ఉందని అక్కడే పరీక్షలు చేశారు వైద్యులు. మామూలు జ్వరమే అని చెప్పారు. బుధవారం ఆ చిన్నారి జ్వరంతో వణికిపోయింది. దీంతో చింతూరు ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేయగా డెంగీ గా తేలింది. భద్రాచలంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో తిరిగి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు పరిస్థితి మరింత విషమించింది. చిన్నారి సంధ్య గురువారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది. చిన్నారి మరణంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.