Site icon HashtagU Telugu

Home Minister Anitha : ఏపీలో మహిళల రక్షణకు స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్..!

A special wing, a special app for the protection of women in AP..!

A special wing, a special app for the protection of women in AP..!

Home Minister Anitha : ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని ఆదేశించారు. ‘సురక్ష’ పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పనపై హోం మంత్రి అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి.. అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి సురక్ష యాప్ రూపకల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read Also: Vizag Steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సమ్మె సైరన్ .. 14 రోజుల డెడ్ లైన్..!

మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని.. విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ ఉండదన్నారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్కుల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది ఏర్పాటుపై చర్చించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఛార్జిషీట్‌లు పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో సురక్ష టీమ్‌లు పెట్టి 24 గంటలు నిఘా ఉంచాలని ఆదేశించారు. 112, 181, 1098 వంటి హెల్ప్ లైన్లపై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు దగ్గరై నేరాలు తగ్గించాలని సూచించారు.

రాష్ట్రంలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, డ్రోన్ల వినియోగం పెంచాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటలూ డీఎస్పీ స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని హోం మంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో మహిళలను అసభ్య పదజాలంతో దూషించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా వాడకంపై యువతలో అవగాహన పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read Also: Koneru Konappa : కాంగ్రెస్‌కు కోనేరు కోనప్ప బై బై