మంకీ పాక్స్ (Mpox Virus)…ఇప్పుడు ప్రపంచ ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా పీడ పోయిందని అంత భావిస్తుండగా..ఇప్పుడు మంకీ పాక్స్ వైరస్ నిద్ర పట్టకుండా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు ఈ కేసులు పెరుగుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యింది. తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది. అయితే మంకీపాక్స్ సోకిన రోగిని ఇప్పటి వరకు గుర్తించలేదని అధికారులు వెల్లడించారు. భారత్‌లో ఎంపాక్స్ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయినప్పటికీ మంకీ పాక్స్ పట్ల ఆసుపత్రి వర్గాలను అలర్ట్ చేస్తున్నాయి పలు రాష్ట్రాలు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే హైదరాబాద్ ఫీవర్ హాస్పటల్ లో మంకీ పాక్స్ వార్డులను ఏర్పాటు చేసారు. కరోనా తరహాలోనే ప్రత్యేక వార్డులు సిద్ధం చేశారు. గతంలో కరోనా ట్రీట్‌మెంట్‌కు వినియోగించిన వార్డులను ఇప్పుడు మంకీ పాక్స్ వార్డులుగా మార్చారు. ఒక్కో వార్డులో 30 మంది పేషెంట్లకు చికిత్సను అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రతి బెడ్‌కు వెంటిలేటర్లను అమర్చారు. దీంతో పాటు సాధారణ లక్షణాలు కలిగిన పేషెంట్లకు వైద్యం అందించేందుకు ఐసోలేషన్ వార్డులను కూడా అందుబాటులో ఉంచారు. ఒక్కో వార్డులో యాభై మంది పేషెంట్లకు వైద్యం అందించవచ్చని డాక్టర్లు తెలిపారు. ఇటు విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో మంకీ పాక్స్ వార్డులను ఏర్పాటు చేసారు. అత్యాధునిక వైద్య పరికరాలతో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కేసులు వస్తే సంసిద్ధంగా ఉండేలా ఆరు పడకలతో ప్రత్యేక వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ఇంజెక్షన్లు సిద్ధం చేసిన వైద్య అధికారులు.. మంకీపాక్స్ కు సపోర్టు ట్రీట్మెంట్ మాత్రమే ఉందంటున్న వైద్యులు.. ప్రత్యేక మందు అనేది మంకీపాక్స్ కు లేదని వెల్లడించారు.
Read Also : Sapota: సపోటా పండ్లు తింటున్నారా.. ఇదే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!