Krishna Police: పోలీస్ కుటుంబాల‌తో న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్ జ‌ర‌పుకున్న ఎస్పీ

కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశ‌ల్ న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను పోలీసుల కుటుంబాల‌తో జ‌రుపుకున్నారు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల ఇంటికి స్వ‌యంగా ఎస్పీ వెళ్లి స‌ర్ ప్రైజ్ చేశారు.

  • Written By:
  • Publish Date - January 2, 2022 / 05:45 PM IST

కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశ‌ల్ న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను పోలీసుల కుటుంబాల‌తో జ‌రుపుకున్నారు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల ఇంటికి స్వ‌యంగా ఎస్పీ వెళ్లి స‌ర్ ప్రైజ్ చేశారు. హోంగార్డు న‌ర‌సింహ‌రావు ఇంటికి వెళ్లిన ఎస్పీకి ఆ కుటుంబం ఆపూర్వ స్వాగ‌తం ప‌లికింది. ఎస్పీ సిద్ధార్థ కౌశ‌ల్ న‌ర‌సింహారావు కుటుంబానికి స్వీట్లు, చాకెట్లు, కేక్ ఇచ్చి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ కుటుంబంతో కాసేపు గ‌డిపి పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు.
మ‌రో కానిస్టేబుల్ రాంబాబు ఇంటికి కూడా ఎస్పీ వెళ్లారు. దీంతో ఆ కుటుంబం ఎంతో సంతోష ప‌డింది. ఎస్పీతో క‌లిసి నూత‌న సంవ‌త్స‌ర వేడుకలు జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని కానిస్టేబుల్ రాంబాబు తెలిపారు

ఉల్లిపాలెం గ్రామంలోని కానిస్టేబుల్ రామ‌చంద్రారావు ఇంటికి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రావ‌డంతో ఆయ‌న ఆనందానికి అవ‌ధులు లేవు. రామంచ‌ద్రారావు పిల్ల‌ల‌ను ఎస్పీ తన ఒడిలోకి తీసుకుని వారి చదువులు, జీవితంలోని ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లతో కూడా మాట్లాడి వారి ఆరోగ్యం, వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. త‌న శాఖ‌లో పోలీసుల కుటుంబ సంక్షేమం చూసుకోవ‌డం కూడా త‌న బాధ్య‌త అని…ఈ రో్జు త‌న‌కు ప్ర‌త్యేక మైన రోజ‌ని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.

గుడివాడ డీఎస్పీ ఎన్.సత్యానందం, నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కె.ధర్మేంద్ర, మచిలీపట్నం డీఎస్పీ మాసుమ్ బాషా సహా 100 మందికి పైగా పోలీసు అధికారులు జిల్లాలోని వివిధ డివిజన్లలోని దాదాపు 500 మంది సిబ్బంది ఇళ్లను సందర్శించారు.ఏఎస్పీ ప్రసాద్, అవనిగడ్డ డీఎస్పీ మెహబూబ్ బాషా, దిశ డీఎస్పీ జి.రాజీవ్ కుమార్, ఇతర అధికారులు సిబ్బంది కుటుంబాలతో కలిసి కేక్ కట్ చేశారు. ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు త‌మ‌ ఇళ్లకు రావ‌డం ఇదే తొలిసారని దీనికి వారంతా ఎస్పీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.