Site icon HashtagU Telugu

Nandigam Suresh : సుప్రీం కోర్టులో నందిగం సురేష్ కు ఎదురుదెబ్బ

A setback for Nandigam Suresh in the Supreme Court

A setback for Nandigam Suresh in the Supreme Court

Nandigam Suresh : వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ నదిగం సురేష్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నందిగం సురేష్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ జనవరి 7కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నందిగం సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

కాగా, మరియమ్మ హత్య కేసులో బెయిల్ నిరాక‌రిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును స‌వాల్ చేస్తూ.. నందిగం సురేష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను శుక్ర‌వారం సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ దీపాంక‌ర్ ద‌త్తా, జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రాల‌తో కూడిన ద్విస‌భ్య‌ ధ‌ర్మాస‌నం విచారించింది.

నందిగం సురేష్ త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబాల్ వాద‌న‌లు వినిపించారు. ఇది రాజ‌కీయ కక్ష‌తో పెట్టిన కేసని, ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో సురేష్ లేర‌ని వాదించారు. 2020లో రాయి త‌గిలి మృతి చెందిన మ‌రియ‌మ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి, సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశార‌ని ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. ద‌ర్యాప్తు అధికారి అనుకూలంగా (ఫేవ‌ర్‌) చేశార‌ని స్థానిక న్యాయ‌మూర్తి ఎలా చెబుతార‌ని అన్నారు. టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ద‌ళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్ర‌మంగా ఈ కేసులో చేర్చార‌ని సిబల్ వివరించారు.

Read Also: Ashwin: చెన్నై బౌలింగ్ కోచ్ గా అశ్విన్, మెంటర్ గా మాహీ