ఏపీలో గడిచిన ఐదేళ్లలో మందు బాబులు ఎంత బాధపడ్డారో తెలియంది కాదు. నాణ్యమైన మద్యం దొరకక..దొరికిన మద్యం కూడా అధికార ధరలు ఉండడం తో మద్యం తాగేందుకే చాలామంది తెలంగాణ వచ్చి తాగేవారు. ఈ క్రమంలో కూటమి పార్టీ…తమ పార్టీ అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యం..సరసమైన ధరలకే అందిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చినట్లే ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..మందుల కోర్కిలు తీస్తూ వస్తుంది. ఇప్పటికే చాల బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్..త్వరలో మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకరాబోతుంది. అంతే కాదు మద్యం ధరలను కూడా భారీ తగ్గించబోతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను రూ. 80 నుంచి రూ. 90 కే విక్రయించాలని భావిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
కొత్త మద్యం విధానంపై రెండు రోజుల్లో అధికారుల కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించబోతున్నాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ అధికారులు అక్కడి మద్యం విధానాల్ని అధ్యయనం చేసి, లిక్కర్ కంపెనీలతో చర్చలు జరపడం జరిగింది. ఈ క్రమంలోనే అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు.
Read Also : EVOL : సినిమా రిలీజ్‌కి నో చెప్పిన సెన్సార్ బోర్డు.. ఓటీటీని టార్గెట్ చేసిన బోల్డ్ సినిమా..