A political freak : ఏపీపై దొంగాట‌!

ఏపీ మీద బీజేపీ మ‌రో దొంగాట (A political freak) మొద‌లు పెట్టింది. స‌హ‌జ మిత్రుడికి వ్య‌తిరేకంగా మాట్లాడి మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది.

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 02:25 PM IST

ఏపీ మీద బీజేపీ మ‌రో దొంగాట (A political freak) మొద‌లు పెట్టింది. స‌హ‌జ మిత్రుడికి వ్య‌తిరేకంగా మాట్లాడి మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. తొమ్మిదేళ్ల న‌రేంద్ర మోడీ పాల‌నలోని అభివృద్ధి గురించి చెప్పుకోవ‌డానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక రోజు తేడాతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. తిరుప‌తి స‌భ‌లో న‌డ్డా, విశాఖ స‌భ‌లో అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల చిత్రాన్ని మార్చ‌డానికి అనువుగా క‌నిపిస్తున్నాయి.

ఏపీ మీద బీజేపీ మ‌రో దొంగాట (A political freak)

ఫ‌క్తు రాజ‌కీయాల‌ను చేసే పార్టీగా బీజేపీ గ‌త తొమ్మిదేళ్లుగా క‌నిపిస్తోంది. సిద్ధాంతాలు, నైతిక‌త, నిజాయితీ అనే ప‌దాల‌కు తిలోద‌కాలు ఇచ్చింది. విప‌క్షాల‌ను చీల్చి చెండాడుతూ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను వాడేసుకుంటోంది. కాద‌న్న వాళ్ల‌ను అంత‌చూడ్డానికి అధికార‌దుర్వినియోగం ఏ స్థాయిలోనైనా చేయ‌డానికి వెనుకాడ‌డంలేదు. అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌లో అవినాష్ రెడ్డిని సేఫ్ గా ఉంచ‌డం. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ క‌విత‌ను ర‌క్షించ‌డాన్ని ( A political freak) ప్ర‌స్తావించుకోవ‌చ్చు.

వైసీపీ, బీజేపీని వేర్వేరుగా చూడ‌లేని విధంగా

గ‌త నాలుగేళ్లుగా వైసీపీ, బీజేపీని వేర్వేరుగా చూడ‌లేని విధంగా ప‌నిచేశాయి. రాజ‌కీయాల‌కు అతీత‌మైన బంధం ప్ర‌ధాని మోడీతో ఉంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌హిరంగ వేదిక‌పై చెప్పారు. అల్లూరి సీతారామరాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌, విశాఖ‌లో జ‌రిగిన న‌రేంద్ర మోడీ (Narendra modi )స‌భ‌ల‌ను అవ‌లోకిస్తే ఆ రెండు పార్టీల మ‌ధ్య ఉన్న ఫెవికాల్ బంధం అర్థ‌మ‌వుతోంది. వారం క్రితం ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చ‌క్ర‌తిప్ప‌డం(A political freak) ద్వారా అవినాష్ రెడ్డిని అరెస్ట్ నుంచి త‌ప్పించ‌గ‌లిగారు. అంతేకాదు, శ‌ర‌త్ చంద్రారెడ్డి ని ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో అప్రూవ‌ర్ గా మార్చ‌డం ద్వారా బీజేపీకి స‌హ‌కారం అందించార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : Jagan Governament : ఉద్యోగుల‌పై జ‌గ‌న్ విజ‌యం!ఒకే ఒక్క‌డు సూర్య‌నారాయ‌ణ!!

కేంద్రంలోని పెద్ద‌లు చెప్పిన‌ట్టు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తూచ త‌ప్పకుండా అనుస‌రిస్తున్నారు. రైతుల మోటార్ల‌కు స్మార్ట్ మీట‌ర్ల పెట్ట‌డం నుంచి పీపీఏల‌ను రివ్యూ చేసే వ‌ర‌కు కేంద్రం న‌డిపించింది. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ఆస్తుల‌ను అమ్మ‌డానికి రాష్ట్ర స‌హ‌కారంతో కేంద్రం సిద్ధ‌మయింది. పోల‌వ‌రం ఎత్తును త‌గ్గించ‌డానికి కేంద్రం చెప్పిన‌ట్టు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌లాడించారు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక అడుగు కూడా కేంద్రానికి తెలియ‌కుండా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేయ‌లేదు, వేయ‌రు కూడా. కానీ, ఫ‌క్తు రాజ‌కీయాల‌ను చేసే బీజేపీ ముందుచూపుతో ఏపీ రాజ‌కీయాన్ని(A political freak) ర‌క్తిక‌ట్టిస్తోంది.

వైసీపీ, బీజేపీని వేర్వేరుగా చూడ‌లేని విధంగా

ఏపీలో అవినీతి జ‌రిగింద‌ని ఆధారాల్లేకుండా కేంద్ర‌హోంశాఖ మంత్రి హోదాలో అమిత్ షా మాట్లాడి ఉండ‌రు. ఒక వేళ ఆధారాలు ఉంటే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల ద్వారా విచార‌ణ‌కు ఆదేశించ‌డానికి ఫుల్ పవ‌ర్స్ ఆయ‌న‌కు ఉన్నాయి. అదేమీ లేకుండా రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా పొత్తుకు మార్గాన్ని సుగ‌మ‌మం చేసుకుంటున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు(Chandrababu naidu) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ న‌డ్డాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. పొత్తుకు సంబంధించి సానుకూల స్పంద‌న బీజేపీ నుంచి రాలేద‌ని తెలుస్తోంది. కానీ, విశాఖ‌, తిరుప‌తి స‌భ‌ల ద్వారా షా, నడ్డా ఒకేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మీద మాట్లాడ‌డం పొత్తు దిశ‌గా (A political freak) వాయిస్ వినిపిస్తోంది.

రాష్ట్రం విడిపోయిన త‌రువాత 2014 నుంచి 2018 వ‌ర‌కు బీజేపీ, టీడీపీ భాగ‌స్వామ్య ప్ర‌భుత్వం ఏపీలో ఉంది. అప్ప‌ట్లో రాజ‌ధాని శంకుస్థాప‌న చేసిన న‌రేంద్ర మోడీ ఇప్ప‌టి వ‌ర‌కు దానికి గురించి ప‌ట్టించుకోలేదు. మూడు రాజ‌ధానులు అంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీర్మానం చేసిన తరువాత కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదు. అంటే, ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బీజేపీ మ‌ద్ధ‌తు ఇచ్చింది. రాజ‌ధానిలేని రాష్ట్రం అంటూ ఇప్పుడు అమిత్ షా, న‌డ్డా రాజ‌కీయ వేదిక‌ల‌పై మాట్లాడ‌డం విడ్డూరం.

Also Read : Jagan Family Drama : అంతఃపురంలో అల‌జ‌డి! విజ‌య‌మ్మ‌కు మొఖంచాటేసిన‌ సజ్జ‌ల‌!

ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు పెద్ద‌గా లేదు. ఆ పార్టీ ఉనికి కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే. కానీ, ఏపీలోని వైసీపీ, టీడీపీ ల‌ను ఆడిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మలుచుకోవ‌డానికి ఢిల్లీ పెద్ద‌లు స్కెచ్ వేశారు. రాష్ట్రంలోని 25 ఎంపీల్లో 23 ఎన్డీయేకి ఇవ్వాల‌ని షా కోర‌డం ఆ పార్టీ ల‌క్ష్యాన్ని తెలియ‌చేస్తోంది. ఆ క్ర‌మంలో టీడీపీ, జ‌న‌సేన‌తో నేరుగా పొత్తుతో పాటు వైసీపీతో తెర‌వెనుక స్నేహం ఉంటుంద‌న్న‌మాట‌. ఫ‌లితంగా 25కు 25 ఎంపీల‌ను బీజేపీ సొంతం చేసుకోవాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ చేసింది. అందుకే, స‌హ‌జ మిత్రున్ని సున్నితంగా మంద‌లిస్తూ చంద్ర‌బాబు ప‌క్షాన చేర‌డానికి సంకేతాలు ఇస్తోంది. అందుకు బ‌లం చేకూరేలా బీజేపీతోనూ పోరాడాల్సిన ప‌రిస్థితులు వ‌స్తున్నాయ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప‌రిణామం బీజేపీకి లాభంగా క‌నిపిస్తుంటే, టీడీపీకి మాత్రం న‌ష్టం క‌లిగించేలా ఉంద‌ని(A political freak) స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

 Also Read : BJP Strategy : ఏపీలో BJP స‌భ‌లు! జ‌న‌సేన‌కు హ్యాండ్‌! పొత్తుపై షా,న‌డ్డా ఎత్తుగ‌డ‌!